Sunday, December 22, 2024

బిఆర్‌ఎస్‌కే బ్రహ్మరథం

- Advertisement -
- Advertisement -

భారత రాష్ట్ర సమితి గురువారం అ సెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీల తొలి విడత జాబితాను విడుదల చేసింది. 54 నియోజకవర్గాలకు గాను పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులను ఆయా అసెంబ్లీల ఇన్‌చార్జీలుగా పార్టీ అ ధ్యక్షుడు కెసిఆర్ ఆదేశాల మేరకు ఇన్‌చార్జీలుగా నియమించడం జరిగింది. పార్టీ ఇన్‌చార్జీలతో జరిగిన టెలి కాన్ఫరెన్స్ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వీరికి దిశా నిర్దేశం చేశారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో భారత రా ష్ట్ర సమితికి అద్భుతమైన సానుకూల వాతావరణం ఉన్నదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. గత పది సంవత్సరాలలో తెలంగాణ రా ష్ట్రాన్ని అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులుగా ముందుకు తీసుకెళ్లిన సిఎం కెసిఆర్ నాయకత్వానికి ప్రజలు ము మ్మాటికి బ్రహ్మరథం పడుతున్నారని అభిప్రాయపడ్డారు. గురువారం పార్టీ నియమించిన అసెంబ్లీల ఇన్‌చార్జీలతో కెటిఆర్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ ఎంఎల్‌ఎ అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన కా ర్యాచరణ పైన పార్టీ ఇన్‌చార్జీలకు దిశానిర్దేశం చే శారు.

భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం పది సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని ఓట్లు అడగాలని, ఇందుకోసం 10 సంవత్సరాలలో బిఅర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రతి ఇంటి గడపకు తీసుకువెళ్లాలని పార్టీ ఇన్‌చార్జీలకు కెటిఆర్ సూచించారు. ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికలు కేవలం హామీలు ఇచ్చేందుకు వేదికలు మాత్రమే అని బిఆర్‌ఎస్ పార్టీకి మాత్రం 10 సంవత్సరాలలో చేసిన ప్రగతిని ప్రజలకు వివరించే ఒక అద్భుతమైన  అవకాశం అన్నారు. గత పది సంవత్సరాలుగా బిఆర్‌ఎస్ పార్టీ పాలనలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకం కావాలని పార్టీ నాయకులకు సూచించారు. గురువారం ఇన్‌చార్జీలుగా నియమించిన ప్రతి ఒక్క నాయకుడు ఇప్పటినుంచే పార్టీ విజయానికి అవసరమైన కార్యాచరణను, కార్యక్రమాలను చేపట్టాలని, శుక్రవారం నుంచి ఎన్నికలు ఫలితాలు వెలువడే రోజు వరకు ఆయా నియోజకవర్గాల సంపూర్ణ బాధ్యతను వీరు తీసుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులు అన్నింటినీ సమన్వయం చేసుకొని పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు.

ఈ టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు పార్టీ ఇన్‌చార్జ్జీలకు పలు సలహాలు, సూచనలు అందించారు. రానున్న 45 రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీల నిర్వహణ మొదలుకొని నియోజకవర్గ స్థాయి వరకు అన్ని దశల్లో పార్టీ ప్రచారం పకడ్బందీగా ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందించు కొని అమలు చేయాలని సూచించారు. ఇన్‌చార్జీలుగా కార్యకర్తలు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రత్యేకంగా మాట్లాడారు. తమకు బాధ్యత అప్పజెప్పిన కార్యక్షేత్రంలో గత పది సంవత్సరాలలో జరిగిన మంచి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు పోవాలని సూచించారు. ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధిస్తుందని తెలిపిన హరీశ్‌రావు ఆ దిశగా ఈ 45 రోజులపాటు విస్తృతంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News