Saturday, December 21, 2024

సామాజిక మార్పు సంక్షేమ పథకాలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు ఓట్ల కోసం కాదని ప్రతి పథకం సామాజిక మార్పు కోసం ప్ర వేశపెట్టినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడలో నిర్వహించిన డాక్టర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అ తిథిగా హాజరై ప్రసంగిస్తూ ప్రైవేటు ఆసుపత్రుల కు దీటుగా ప్రభుత్వం ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన సేవలందిస్తున్నాయని, మెడికల్ కళాశాలలను మారుమూల జిల్లాల్లోనూ గిరిజనులకు వైద్య విద్య అందేలా చర్యలు చేపట్టినట్లు తెలిపా రు. కళ్యాణలక్ష్మి పథకం తీసుకొచ్చి బాల్య వివాహాలు అరికట్టామని, కెసిఆర్ కిట్లతో ప్రభుత్వ ఆ సుపత్రుల్లో ప్రసవాలు 30నుంచి 70 శాతం పెరిగిగాయని, గ్రామాల్లో వైద్య సేవలు అందించేందుకు 1100 వైద్యులు ముందుకు వచ్చారని పే ర్కొన్నారు. నిమ్స్‌లో ఇటీవలే కొత్త వార్డు ఏర్పాటు చేయడం ద్వారా వందలాది మంది రోగులకు వైద్య అందించే అవకాశం ఉంటుందన్నారు.

వైద్య వృత్తి అనేది ఎంతో  గొప్ప వృత్తి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికులను, దేశానికి అన్నం పెట్టే రైతును, దేశ ప్రజలకు ప్రాణదానం చేసే వైద్యులను ఈ సమాజం మర్చిపోద్దన్నారు. కరోనా సమయంలో కుటుంబ సభ్యులు సైతం దూరంగా ఉంటే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించి మేము ఉన్నామంటూ సేవలందించి కరోనా నుంచి ప్రపంచాన్ని కాపాడారు. వైద్య సిబ్బంది ప్రాముఖ్యత ఏంటో ప్రతి ఒక్కరికీ అర్థమైందన్నారు. మానవాళిని కాపాడుకుంటున్న మీ సేవలను డాక్టర్స్ డే సందర్బంగా గుర్తుచేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వైద్యోరోగ్య రంగాన్ని బాగు చేయడంతో పాటు, ప్రివెన్షన్ పై ప్రభుత్వం దృష్టి సారించింది. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, మిషన్ భగీరథతో మంచి నీళ్ళు అంది రోగాలు తగ్గాయన్నారు. తెలంగాణ గ్రీన్ కవర్ పెంపుదలతో మొదటి స్థానంలో నిలిచిందని, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల ద్వారా ఉపరితల జలాలతో పండిన పంటలతో ప్రజలకు మంచి ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు.

తెలంగాణ డయాగ్నోసిక్ ద్వారా 134 పరీక్షలు చేస్తున్నట్లు 500 బస్తీ దవాఖానల ద్వారా పట్టణ ప్రజలకు వైద్య సేవ చేస్తున్నామని చెప్పారు. నాడు మూడు డయాలసిస్ సెంటర్లు ఉంటే, నేడు 102 కు పెంచామని, 10 వేల ఐసియు బెడ్స్, 10 వేల సూపర్ స్పెషాలిటీ బెడ్స్, 550 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. కరోనా లాంటి పరిస్థితులను ఎదుర్కొనేలా 50 వేల పడకలు ఏర్పాటు చేస్తున్నట్లు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెడుతున్నట్లు ఉమ్మడి పాలలో 20 మెడికల్ కాలేజీలుండగా ప్రస్తుతం 56 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి 2850 ఎంబిబిఎస్ సీట్లను 8340 పెంచడంతో పాటు 1161 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో భర్తీ చేశామన్నారు.

దేశ ఆరోగ్య రంగంలో తెలంగాణ నీతి అయోగ్ ర్యాంకుల్లో 11 వ స్థానం నుండి 3 స్థానం వచ్చాము. సీఎం కేసీఆర్ మార్గ నిర్దేశంలో మొదటి ర్యాంకు చేరేలా కృషి చేస్తున్నామని, ఆరోగ్య రంగంలో 34 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News