Sunday, November 17, 2024

సిద్దిపేట కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన అనంతరం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు మీడియా తో మాట్లాడాతూ..ప్రభుత్వ నీటి నిర్వహణ, విద్యుత్ వైఫల్యమే పంట నష్టమని,కరువును నివారించే ప్రయత్నలు ప్రభుత్వం చేయడం లేదన్నారు. దొంగలు పడ్డాక అరు నెళ్లకు కుక్కులు మోరిగినట్లుగాసర్కారు తీరు ఉందని, కెసిఆర్ పొలం బాట పట్టకే సర్కారు పంటల విషయంలో కళ్ళు తెరిచిందని, బిఆర్ఎస్ పోరాటాల వల్ల రైతులకు కొంత ఊరట  ఉందని, వడగళ్ళు, ఎండిన పంటలకు ఎకరాకు 25 వెల నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.వంద రోజుల్లో చేస్తానన్న హామీలు వెంటనే అమలు చేయాలని, ఎలక్షన్ కోడ్ ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చావు కబురు చల్లగా చెప్పారన్నారు. రైతులను దగా చేసింది కాంగ్రెసేనని, వంద రోజుల తరువాతే కోడ్ వచ్చిందని, పంటలకు ఇస్తామన్న బోనస్ యసంగి పంటలకు ఇచ్చి కొనుగోలు చేయాలన్నారు.ఎకరాకు 15 వెలు రైతులకు, కౌలు రైతులకు వెంటనే ఇవ్వాలని,అడుగడుగునా రైతులకు కాంగ్రెస్ అన్యాయం జరుగుతుందని,ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడి ఉండాలని హరీష్ రావు అన్నారు.

బిఅర్ఎస్ అధికారంలో ఉన్నా లేకున్నా మదెప్పుడు రైతు పక్షమేనని, రైతుల పక్షాన కెసిఆర్ మాట్లాడితే కాంగ్రెస్ నేతలు ముప్పేట దాడికి దిగుతున్నారని, ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిందన్నారు. కూడవెల్లి వాగులోకి తక్షణమే నీళ్ళు విడుదల చేయాలని, కెసిఆర్ హయాంలో ఒక్క ఎకరం ఎండలే.. కాంగ్రెస్ వచ్చాకే పంటలు ఎందుతున్నాయన్నారు. నీళ్ళు ఉంఢగా ఇవ్వకుండా పంటలు ఎండగడుతున్నారు.24 గంటల్లో కూడవెల్లికి నీళ్ళు ఇవ్వక పోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.. మల్లన్నసాగర్ ని ముట్టడిస్తామన్నారు. బట్టి విక్రమార్క ఒట్టి మాటలు కట్టిపెట్టి రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వండన్నారు. ముఖ్యమంత్రి బోగస్ మాటలు మాట్లాడుతున్నారని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మమ్మల్ని విమర్శించే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ వచ్చాక నీళ్లు తగ్గి రైతుల్లో కన్నీళ్లు పెరిగినాయని,దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News