- Advertisement -
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో రాష్ట్రం దూసుకుపోతోందని మంత్రి హరీష్‌రావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో అద్భుతాలు సృష్టిస్తోందంటూ ట్విట్టర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు పెడుతోందనేందుకు ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండబోదన్నారు. తలసరి ఆదాయ వృద్ధిరేటులో దేశంలోనే రాష్ట్రం ఆగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలే రుజువుపరుస్తున్నాయని చెప్పారు. జిఎస్‌డిపిలోనూ గణనీయమైన వృద్ధిరేటును తెలంగాణ సాధించిందని వెల్లడించారు. 202122 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం 19.10 శాతంగా నమోదు కాగా.. జిఎస్‌డిపిలోనూ 19.46 శాతం వృద్ధిరేటును నమోదు చేసిందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో దూసుకువెళ్లే విధంగా చేయడం ఒక్క సిఎం కెసిఆర్ వల్లే సాధ్యపడగలిగిందని ఆయన అన్నారు.
- Advertisement -