సిద్దిపేట: గౌరవేల్లి రిజర్వాయర్ సంఘటనపై సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో మంత్రి హరీశ్ రావు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి నీళ్లు రావద్దు అనే లక్ష్యంగా ప్రతిపక్షాల కుట్రలు చేశారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ లబ్దికి ప్రయత్నించారు. నాడు మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ జలాశయం పనులు అడ్డుకుని, పోలీసులపై తెరగపడేలా చేసి తప్పుకున్నారు. ప్రజలు, రైతులు బాగు పడటం ఇష్టం లేక అడ్డుకునే యత్నాలు చేశారు. కేసీఆర్ లక్ష్యంతో లక్షలాది ఎకరాల్లో కోట్లాది క్విఎంటళ్ల పంట పండింది. నీళ్లు తెస్తుంటే రైతుల కళ్ళలో ఆనంద బాష్పయాలు వస్తుంటే, ప్రతిపక్షాల్లో కన్నీళ్లు వస్తున్నాయి. ఇరిగేషన్ అధికారులు పనులు చేసుకుంటే వరుసగా దాడులు చేస్తూ పనులు అడ్డుకున్నారు. పరియాకరలు పగుల గొట్టారు. పోలీస్ ప్రొటెక్షన్ అడిగితే భద్రత కల్పించారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు వెళ్లి డిస్ట్రబ్ చేశారు. రేగొండ పంప్ హౌస్ లో పనులు చేసుకుంటే ఎందుకు అడ్డుకున్నారు. గౌరవెళ్లి నిర్వాసితులు వాళ్ల ట్రాప్ లో పడొద్దని మంత్రి హరీశ్ ప్రజలకు సూచించారు.
ఎన్నిసార్లు అయినా మీతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మంత్రి 2013 చట్టం ప్రకారం ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేస్తామన్నారు. 3816 ఎకరాల భూ సేకరణ చేశాం. కేవలం 84 ఎకరాల భూమి సేకరణ జరగ లేదు. వాళ్లు కోర్టుకు వెళితే వారి పరిహారం కోర్టులో డిపాజిట్ చేస్తాం. భూ సేకరణ 97.82 శాతం జరిగింది. ఇంకా 2.1 శాతం మాత్రమే సేకరణ చేయాలి ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విదంగా గౌరవెళ్లి నిర్వాసితులకు ఎకరానికి 15 లక్షల పరిహారం ఇస్తున్నాం. భూ సేకరణలో ఇప్పరటికే 97.82 శాతం 200 కోట్లు చెల్లించాము. ఈ 84 ఎకరాల నిర్వాసితులు తీసుకోలేదు. 97.82 శాతం పరిహారం చెల్లించాము. 693 ఇండ్లు ఉన్నాయి. 2015లో 683 ఇండ్లకు 83 కోట్లు చెల్లించాము. 98.58 శాతం పేమెంట్ చేశాం.. ఇంకా 1.45 మాత్రమే చెల్లించాలి ఉంది. కేవలం 10 ఇండ్లకు మాత్రం చెల్లించలేదు.. ఇందులో 5 ఇండ్లు రీ సర్వే చేయమన్నారు.. మిగితా 5 ఇండ్లలో కుటుంబ తగాదాలు ఉన్నాయి. ఆర్ అండ్ ఆర్ కింద మొత్తం 937 కుటుంబాలను గుర్తించాము.. ఇందులో 927 కుటుంబాలకు పరిహారం చెల్లించామని మంత్రి పేర్కొన్నారు.
ఇది 98.93 చెల్లించాము. మిగతా 10 కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. మోటార్లు చైనా నుంచి తెప్పించాము. వీటికి 3 ఏళ్లు వారంటీ ఉంటుంది. ఆ సమయం దగ్గర పడటంతో వెట్ రన్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడేళ్లు పూర్తయితే మోటార్లు నడవక పోటీ ఎవరు భాద్యత వహించాలి. 60 ఏళ్లు అధికారంలో ఉండి సాగు నీలి తెలీదు. లక్ష ఏకరాలకు ఈ వానాకాలం సాగు నీలి ఇద్దామనుకుంటున్నాము. మీరు వద్దంటారా ? నిర్వాసితులకు దండం పెట్టి చెబుతున్నా.. ఈ కాంగ్రెస్, బీజేపీ ట్రాప్ లో పడకండి.. మీకు సమస్యలుంటే మీ తరుపున ప్రతినిధి బృందం వచ్చి అధికారులతో చర్చించండి. ప్రభుత్వం నిర్వాసితుల పట్ల సానుభూతి తో ఆలోచిస్తాం. గోదావరి జలాలు హుస్నాబాద్ ను ముద్దాడదనికి వస్తుంటే కాంగ్రెస్, బీజేపీ లు అడ్డుకుకుంటున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి గోదావరి జలాలు రాకుండా చేయడమే కాంగ్రెస్, బీజేపీ నాయకుల లక్ష్యం. అభివృద్ధి నిరోదకులు.. నీళ్లు వస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. గౌరవెళ్లి పూర్తయితే లక్ష కుటుంబాలు లాభ పడతాయి. హుస్నాబాద్ లో గ్రామగ్రామాన కాంగ్రెస్, బీజేపీ దుర్మార్గాలను ఎండగడతామని ఆయన వెల్లడించారు.