Monday, December 23, 2024

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ పై స్పందించిన మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీక్ ఘటన పెద్ద దూమారం లేపింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు, అధికార పక్షం విమర్షలు, ప్రతి విమర్షలు చేసుకున్నాయి. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ ఘటనపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఇలా జరగడం దురదృష్టకరమని, అలా జరగాల్సి ఉండకూడదన్నారు. పేపర్ లీకైతే వాటిని బయటపెట్టింది ప్రతిపక్షాలు కాదని మా ప్రభుత్వమే గుర్తించిందని తెలిపారు. ప్రస్తుతం నిందితులను జైల్లో వేసి కఠినంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. త్వరలోనే టిఎస్‌పిఎస్‌సి పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులుకు ఉద్యోగాలు ఇప్పిస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాలు చెప్పే మాటలు నమ్మకూడదని సూచించారు. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో శనివారం కమిషన్ సభ్యుడు లింగారెడ్డి, సెక్రటరీ అనితరామచంద్రన్‌ను విచారించారించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News