Wednesday, January 22, 2025

సిఎం కెసిఆర్ కృషితో పెరిగిన మత్స్య సంపద

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao Release Fish Seeds in Siddipet

రాష్ట్రవ్యాప్తంగా 120 కోట్ల చేప, రొయ్య పిల్లల పంపిణీ
గోదావరి జలాలతో రైతులు, మత్సకారులు బాగుపడుతున్నారు
చెరువుల్లో చేపలు, రొయ్య పిల్లలను వదులుతున్నాం
తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు సరఫరా అవుతున్న చేపలు
త్వరలో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె, క్యాన్సర్ చికిత్సలు
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు

సిద్దిపేట: సిఎం కెసిఆర్ కృషితో రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగిందని, దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసే స్థాయికి మన మత్స్య సంపద పెరిగిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట కోమటి చెరువులో చేప, రొయ్య పిల్లలను ఆయన వదిలారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి గోదావరి జలాలు రావడంతోనే రైతులు, మత్స్యకారులు ఎంతగానో బాగుపడుతున్నారన్నారు. ఒకప్పుడు తెలంగాణకు ఆంధ్రాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి చేప పిల్లలను తీసుకువచ్చి చెరువుల్లో వదిలేవారన్నారు. ప్రస్తుతం తెలంగాణలోని ప్రతి చెరువులో గోదావరి జలాలు రావడంతో మత్స సంపద పెరిగి ఇతర రాష్ట్రాలకు మనం చేపలను ఎగుమతి చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి 20లక్షల చేప, రొయ్య పిల్లలను ఉచితంగా ప్రభుత్వమే అందిస్తుందన్నారు. కుల వృత్తుల వారు ఆనందంగా సంతోషంగా ఉండాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. మత్స్యకారులకు ఉచితంగా వలలు, వాహనాల కొనుగోలుపై సహాకారం అందిస్తున్నామన్నారు. 15రోజుల్లో జిల్లావ్యాప్తంగా అన్ని చెరువులలో చేప పిల్లలను వదలడం జరుగుతుందన్నారు. నిరంతరం ప్రజలు ఆనందంగా, సంతోషంగా ఉండాలన్నదే కెసిఆర్ లక్షంగా పెట్టుకున్నారన్నారు.

గతంలో సిద్దిపేట కోమటి చెరువు ఆరు సంవత్సరాలకొక్కసారి మత్తడి దూకేదని, గోదావరి జలాలు రావడంతో ప్రస్తుతం ఆరు నెలలపాటు నిరంతరం మత్తడి దూకుతుందన్నారు ప్రజల గౌరవం, విలువలు పెరిగేలా సిద్దిపేటను దశలవారీగా అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. విద్య, వైద్య రంగానికి పెద్ద పీట వేయడంతో మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు. త్వరలో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన చికిత్సలతో పాటు క్యాన్సర్ సంబంధించిన కిమియో, రేడియో చికిత్సలను ప్రారంభించుకోబోతున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో చేపలు విక్రయించడానికి ప్రత్యేకంగా 22 దుకాణాలను ఏర్పాటుచేయడంతో మత్స్యకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కోమటి చెరువులో లక్షా 20వేల చేప పిల్లలతోపాటు 60 వేల రొయ్య పిల్లలను విడుదల చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు, ఆర్డీఓ అనంతరెడ్డి, జిల్లా మత్సశాఖ అధికారి మల్లేశం, డిసిఎంఎస్ డైరెక్టర్ ఖాతా కనకరాజు, గంగ పుత్ర సంఘం అధ్యక్షుడు బిజ్జ రాజయ్య, బిజ్జ లక్ష్మణ్, నాయకులు కడవేర్గు రాజనర్సు, జంగిటి కనకరాజు, బాల్‌రంగం, కూర మాణిక్యరెడ్డి, పూజల వెంకటేశ్వర రావు చిన్న, కెమ్మసారం ప్రవీణ్‌కుమార్, మిద్దె రవి, ఎల్లం, సాయిగౌడ్, శ్రీహరి యాదవ్, ఆశోక్, భాగ్యలక్ష్మితదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News