Monday, December 23, 2024

నెమ్మదిగా విజృంభణ

- Advertisement -
- Advertisement -

WHO warns of 2nd Omicron recombinant virus XE

మహారాష్ట్ర, కేరళలో కరోనా కోరలు, బహిరంగ ప్రదేశాల్లో మళ్లీ మాస్కు నిబంధన

మూడు నెలల తరువాత మహారాష్ట్రలో వెయ్యి దాటిన కేసుల సంఖ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

ముంబై : మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉద్ధృతి ఎక్కువవుతోంది. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి ఉపక్రమించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ల నిబంధనను మళ్లీ తప్పనిసరి చేసింది. ఈమేరకు అదనపు చీఫ్ సెక్రట రీ జిల్లా అధికారులకు రాసిన లే ఖలో ఆదేశించారు. టెస్టింగ్, ట్రా కింగ్‌ను వేగవంతం చేయాలని, జిల్లా యంత్రాంగాన్ని సూచించింది. మహారాష్ట్రలో ఇటీవలే బిఎ 4,బిఎ 6 సబ్ వేరియంట్ కేసులు నమోదవ్వడంతో ప్రజలంతాఅప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా నిబంధన లు తప్పకుండా పాటించాలని కోరింది. మూడు నె లల తరువాత తొలిసారిగా జూన్ 1 న మహారాష్ట్ర లో రోజువారీ కేసులసంఖ్యమళ్లీ వెయ్యి దాటింది. శనివారం 1357 కొత్త కేసులు వె లుగు చూడ గా, మూడు మరణాలు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 763 కేసులు బయటపడ్డాయి. యా క్టివ్ కేసులు మళ్లీ 5 వేలు దాటాయి.

4 వేల దిగువకు కరోనా కొత్త కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. శనివారం కేం ద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం శుక్రవారం 4.45 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చే యగా, 3962 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలిం ది. పాజిటివిటీ రేటు 0.89 శాతంగా ఉంది. మహారాష్ట్ర, కేరళ కలిపి మరోరోజు 2 వేలకు పైగా కేసులొచ్చాయి. ఈ రెండింటితోపాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటం పై శుక్రవారం కేంద్రం ఆయా ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. అమెరికాలో రోజుకు లక్ష కేసులు, ఉత్తర కొరియాలో రోజుకు 80 వేలు, జర్మనీలో రోజుకు 50 వేల కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో 75 శాతం పాజిటివిటీ రేటు పెరిగిందని అన్నారు. దేశంలో గత వారం 21 వేల 55 కేసులు నమోదు కాగా, శుక్రవారం 4 వేల కేసులు నమోదయ్యాయనని చెప్పారు. దేశంలోని 23 రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. మహారాష్ట్ర, తమిళనాడులో కేసులు రెట్టింపు అవుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో పాజిటివీటీ రేటు పెద్దగా లేదని అన్నారు.

చివరి వారంలో మన రాష్ట్రంలో కరోనా కేసులు 0.4 శాతం ( 280 కేసులు) మాత్రమే ఉండగా, ఈ వారం 0.5 శాతం (375 కేసులు) నమోదయ్యాయని, ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత చాలా తక్కువగా ఉందని చెప్పారు. ఈ క్రమంలో మన రాష్ట్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో కరోనా నియంత్రణలోనే ఉందని, కానీ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అలసత్వంతో ఉండకూడదని అన్నారు. కోఠిలోని టీఎస్‌ఎంఐడీసీ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరోనాను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అందకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.

తప్పనిసరిగా మాస్క్ ధరించాలి

కొవిడ్ నిబంధనలను ప్రజలు పాటించాలని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని చెప్పారు. గుంపులు, గుంపులుగా తిరగవద్దని సూచించారు. పిహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలతో సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాధి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా కరోనా పరీక్షలు చేయాలని ఆదేశించారు. వ్యాధి లక్షణాలు ఉంటే ఏమాత్రం అలక్ష్యం చేయకుండా ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా టెస్ట్‌లు చేయించుకుని, అవసరమైన మందులు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా టెస్ట్‌లు, మందులు, వాక్సిన్ ఉచితంగా ఇస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. టెస్ట్, ట్రీట్మెంట్, వాక్సినేషన్ పక్కాగా జరిగేలా వైద్య ఆరోగ్య సిబ్బంది పని చేయాలని దిశానిర్ధేశం చేశారు. ఇప్పటి వరకు కరోనాను నియంత్రించడంలో చాలా బాగా పని చేశారని, అదే స్పూర్తితో ఈ సారి కూడా అప్రమత్రంగా పని చేసి, ప్రజల ప్రాణాలు కాపాడుదామని మంత్రి పిలుపునిచ్చారు.

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

పిహెచ్‌సి నుంచి బోధనాస్పత్రుల వరకు అన్ని కొవిడ్ చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. కొవిడ్‌ను ఎదుర్కోవడానికి వైద్య ఆరోగ్య శాఖ అన్ని రకాలుగా సంసిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజలు చేయాల్సిందల్లా మాస్క్‌లు పెట్టుకోవడం, కొవిడ్ నిబంధనలు పాటించడమే అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫస్ట్ డోస్ 100 శాతం పూర్తయిందని, సెకండ్ డోస్ వాక్సిన్ రాష్ట్రంలో 99 శాతం పూర్తయిందని తెలిపారు. 33 లక్షల డోస్‌ల వాక్సిన్లు సిద్దంగా ఉన్నాయని వెల్లడించారు. 12 నుండి 14 సంవత్సరాల పిల్లలకు వాక్సిన్ ఫస్ట్ డోస్ 89 శాతం పూర్తయిందని, సెకండ్ డోస్ 52 శాతం పూర్తయిందని చెప్పారు.

అలాగే 15- నుంచి 17 ఏళ్ల వయసు ఉన్న వారికి ఫస్ట్ డోస్ 92 శాతం, రెండో డోస్ 80 శాతం పూర్తయిందని తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ 16.8 శాతం వేశామని చెప్పారు. ఇంకా వేసుకోని వారిని గుర్తించి పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని అన్నారు. బూస్టర్ డోస్ అవసరమైన వారిని గుర్తించి బూస్టర్ డోస్ వేయాలని తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు వాక్సినేషన్ వేసుకోని వాళ్లను గుర్తించి, వారందరికీ ఇంటింటికీ వెళ్లి వాక్సినేషన్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వి, టిఎస్‌ఎంఐడిసి ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, హెల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ శ్వేతా మహంతి, డీహెచ్ శ్రీనివాస్ రావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, డీఎంఈ రమేష్ రెడ్డి, వాక్సినేషన్ ఇంఛార్జి సుధీర్ రావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News