Friday, November 22, 2024

ఒమిక్రాన్‌తో ‘ఢీ’కి సిద్ధం

- Advertisement -
- Advertisement -

Minister Harish rao review on Omicron

రాష్ట్రంలో నిలకడగా కేసులు, ఆందోళన వద్దు

మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం,
చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటివి మర్చిపోవద్దు
రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాసరావు

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) డాక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. కరోనా పరిస్థితులు, కొత్త వేరి యంట్ ఒమిక్రాన్‌పై, ప్రభుత్వ సన్నద్ధతపై ఆది వారం రెండు గంటల పాటు వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం డీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమీక్షకు సంబంధించిన వివరా లు వెల్లడించారు. కౌవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కొ విడ్ నియంత్రణకు ఆరోగ్య శాఖ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థి తులను పరిశీలిస్తున్నామని .. రాష్ట్రంలో కేసుల పెరుగుదల నిలకడగానే ఉందని వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎక్కడా నమోదు కాలేదని చెప్పారు. రెండు రోజుల నుంచి పరిస్థితులు మానిటర్ చేస్తున్నామని, రాష్ట్రంలో కేసుల పెరుగుదల గమనించలేదని అన్నారు.

కొత్త వేరియంట్ దేశంలోకి రాకుండా విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ జరుగుతోందని, అక్కడే ఆర్టిపిసిఆర్ పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండేలా చర్యలు తీసుకొని వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని వివరించారు. మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు నిలకడగానే ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. నాలుగైడు నెలలుగా రాష్ట్రంలో 200 లోపే కొవిడ్ కేసులు నమోదు అవుతున్నాయని, రాష్ట్రంలో 90 శాతం మొదటి డోసు, 45 శాతం రెండో డోసు వ్యాక్సిన్ ఇచ్చామని అన్నారు. వ్యవధి గడిచినా రెండో డోసును 25 లక్షల మంది తీసుకోలేదని తెలిపారు. కరోనా కేసులు తగ్గడంతో వ్యాక్సిన్ పట్ల, కరోనా నిబంధనలు పాటించడంలో కొంత నిర్లక్ష్యం ఉన్నట్లు గమనించామని పేర్కొన్నారు. ఏ వేరియంట్ అయినా ఎదుర్కోవడం మన చేతుల్లోనే ఉందని, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం లాంటివి మర్చిపోవద్దని తెలిపారు.

బాధ్యతగా వ్యాక్సిన్ వేసుకోవాలి : డిఎంఇ రమేష్‌రెడ్డి

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంఈ రమేష్ రెడ్డి తెలిపారు. ప్రజలు బాధ్యతగా వ్యాక్సిన్ వేసుకోవాలని పిలుపున్చిరు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, ఇతర జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వైరస్ ఉత్పరివర్తనాలు చాలా జరుగుతాయని పేర్కొన్నారు. కరోనా కొత్తరకం వేరియంట్ ఎంత ప్రమాదకరం అనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్తలు పాటించాలని వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News