సిద్దిపేట: పదవులు శాశ్వతం కాదని ప్రజలకు చేసిన సేవలే శాశ్వతంగా గుర్తిండిపోతాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయ సమవేశ మందిరంలో పట్టణ ప్రగతిపై ఆయన అధికారులు, కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రపంచమంతా చెత్త సమస్య ఎదుర్కుంటుందన్నారు. చెత్త రహిత సిద్దిపేట లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. చెత్తతో ఆదాయం సమకూర్చుకునే దిశగా సిద్దిపేట మున్సిపాలిటీ ఎదిగిందన్నారు. ప్రతి ఒక్కరు తడి, పోడి , హానికర చెత్తను వేరు వేరు చేసి మున్సిపల్ వాహానాలకు అందించాలన్నారు. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన భాధ్యత కౌన్సిలర్లు, అధికారులపై ఉందన్నారు.
నిరంతరం కౌన్సిలర్లు వార్డులలో పర్యటించి ప్రజాసమస్యలపై దృష్టి సారించాలన్నారు. బెంగుళూరుకు చెందిన ప్రముఖ సామాజిక సేవకురాలు శాంతి సిద్దిపేట గత కొన్ని నెలల నుండి ఉంటూ చెత్తపై ప్రజలకు ఎంతగానో అవగాహన కల్పిస్తుందన్నారు. ప్రతి రోజు సిద్దిపేట మున్సిపాలిటీలో 55 వేల కిలోల చెత్త సేకరణ అవుతుందన్నారు. సిద్దిపేట లో ప్రారంభించుకున్న స్వచ్చబడి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేలా కృషి చేద్దామన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వచ్చబడి పాఠాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేట మున్సిపాలిటీలో బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. పట్టణంలోని మూడు వార్డులలో వార్డు స్థాయి కంపోస్టు ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. కౌన్సిలర్లు అంతా చాలెంజ్‌గా తీసుకొని పట్టణ అభివృద్దే లక్ష్యంగా పని చేయాలన్నారు. సిద్దిపేటలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యుజిడి) పనులు త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తయిన వెంటనే ప్రతి ఇంటికి కలెక్షన్‌లను ఇవ్వాలన్నారు.దోమ రహిత సిద్దిపేటగా మర్చే విధంగా పని చేయాలన్నారు.
తాడిపత్రి మున్సిపాలిటీలో 80 కోట్ల డిపాజీట్ నిల్వఉందని ఇదే తరహాలో మన మున్సిపాలిటీ ఆదాయం నిల్వ ఉంచేలా ముందడుగు వేద్దామన్నారు. ప్రజా శ్రేయస్సుకోసం కౌన్సిలర్లకు తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. అందరి సహాకారంతోనే సిద్దిపేట మున్సిపాలిటీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ సమీక్షలో చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు, వైస్ చైర్మన్ జంగటి కనకరాజు, డాక్టర్ శాంతికుమారి, కమిషనర్ రమణాచారి, కౌన్సిలర్లు , నాయకులు బర్ల మల్లికార్జున్, గ్యాదరి రవిందర్, కల్వకుంట మల్లికార్జున్, దర్మవరం బ్రహ్మం, సద్ది నాగరాజురెడ్డి, కెమ్మసారం ప్రవీణ్‌కుమార్, ఆర్షద్, కొండం కవిత సంపత్‌రెడ్డి, సాకి బాల్ లక్ష్మి ఆనందర్, మోహీస్, శ్రీనివాస్‌రెడ్డి, రియాజ్, తదితరులు పాల్గొన్నారు.
Minister harish rao review on pattana pragathi