Monday, January 20, 2025

రైల్వే పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలి: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Minister Harish rao review on Siddipet railway works

రైల్వే లైన్ భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చెయాలి…

జిల్లాకు అవసరమగు 4వేల టార్పెలిన్ కవర్లు వెంటనే ఇవ్వాలి..

జిల్లా వ్యాప్తంగా 413 కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తేవాలి..

కొత్తగా మరో 88 ప్యాడి క్లినర్లు వచ్చే రెండు రోజులు ఏర్పాటు చేయాలి…

పిడుగు పాటు కు తో మృతి చెందిన దుబ్బాక రైతు కు 4 లక్షల ఎక్స్ గ్రేషియా

వ్యవసాయ శాఖ నుండి రైతు భీమా 5లక్షల చెక్ ని వెంటనే ఇప్పించాలి…

సిద్దిపేట: సిద్దిపేట రైలు కూతకు బాటలు పడాలని వచ్చే కొద్దీ రోజుల్లో రైలు రాబోతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో జిల్లా ఆడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో, అర్భన్ తహశీల్దార్, మార్కెటింగ్ డీఎం లతో పలు అంశాలపై సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పెండింగ్ లో ఉన్న రైల్వే పనులపై అడిగి తెలుసుకున్నారు. దుద్దేడ వరకు అవసరం అయిన భూసేకరణ పనులు పూర్తి అయ్యాయని.. దుద్దేడ నుండి సిద్దిపేట వరకు పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.. రైల్వే అధికారులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి సిద్దిపేట రైల్వే స్టేషన్, దుద్దేడ నుండి సిద్దిపేట వరకు రైల్వే పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లావ్యాప్తంగా 413 కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్న అన్ని కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు వెంటనే అందజేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడలన్నారు. ప్యాడి క్లినర్స్ అందుబాటులోకి తేవాలని చెప్పారు. ఎన్ సాన్ పల్లిలో పిఎసీఎస్ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని చెప్పారు. ధాన్యం తడవకుండా అన్ని చర్యలు చేపట్టాలని, తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆరబెట్టాలని సూచించారు..

పిడుగు పాటుతో మృతి చెందిన కుటుంబానికి ప్రభుత్వం అదుకుంటుంది. 4లక్షల ఎక్స్ గ్రేషియా చెక్ ను వెంటనే అందజేయాలని, వ్యవసాయ శాఖ ద్వారా 5 లక్షల రైతు భీమా ప్రభుత్వం ఇస్తుందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని న్రరంగల గడ్డలో అకాలవర్షానికి పిడుకు పాటు గురై మృతి చెందిన చౌడ పోచయ్య తండ్రి ఎల్లయ్య కుంటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుండి 4 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా రైతు భీమా ద్వారా 5 లక్షలు కూడా ఇస్తామని వెంటనే చెక్ ను అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా లో వివిద ప్రాంతంల్లో పిడుగు పడి పశువులు , పంట చెట్లు అన్ని కూడా విచారణ చేపట్టి వెంటనే నష్ట పరిహారం అందించాలను ఆదేశించారు. చేర్యాలలో ఉన్న ప్రభుత్వ ఎస్సి మహిళా డిగ్రి కళశాల ను మెదక్ ఇంజనీరింగ్ కళాశాల కు షిఫ్ట్ చేయాలని ఆడిషనల్ కలెక్టర్ ను ఆదేశించారు. సరైన వసతి లేక విద్యార్థులకు తీవ్రంగా ఇబ్బందులు అవుతున్నాయని వెంటనే మెదక్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలోకి మార్చాలని సూచించారు. కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవనంకు 25 కోట్లు మంజూరు అయినట్లు ఎన్ సాన్ పల్లి పరిధి లో స్థలం ఎంపిక చేయడం జరిగిందని వెంటనే టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి భవనపనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నంగునూర్ మండలం, చిన్నకోడూర్ మండలం లోని మిగులు పోయిన కాలువల పనులు వెనువెంటనే పూర్తి కావలన్నారు. మందపల్లి వద్ద నిర్మించ బోయేఆటో నగర్ పనులు వెంటనే చేపట్టాలని అందుకు అధికారులతో సమీక్ష నిర్వహించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News