Monday, January 20, 2025

కాలువల భూసేకరణ పనులు వేగవంతం చేయాలి: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కాలువల భూసేకరణ, నిర్మాణ పనులపై సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీష్ రావు అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. మల్లన్నసాగర్ 1R కాలువ.. ఆయకట్టు 21000 ఎకరాల పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మల్లన్న సాగర్ 1R పరిధిలో ఉండే గ్రామాలు బండారుపల్లి,తడ్కపల్లి,పొన్నాల, ఎన్ సాన్ పల్లి,సిద్దిపేట, నాంచారు పల్లి, బక్రీచేప్యాల, వెల్కటూర్,బాషగూడెం, మిట్టపల్లి, దుద్దేడ,అంకిరెడ్డిపల్లి,కొనయిపల్లి,బండారం,మర్పడగా వెళ్లే కాలువ భూసేకరణ, నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎస్ఈ ఇరిగేషన్,ఈఈ ఇరిగేషన్, కలెక్టర్ కు ఫోన్ లో మంత్రి ఆదేశించారు.

అదేవిధంగా మల్లన్న సాగర్ 3ఆర్, 4ఆర్ కాలువ మీద మంత్రి సమీక్ష నిర్వహించారు. పుల్లూర్, బండచెర్లపల్లి గ్రామాల చెరువులు కుంటలు నింపేల వెంటనే చర్యలు చేపట్టి త్వరితగతిన నీళ్లు నింపాలని అధికారులను ఆదేశించారు. పుల్లూర్ గ్రామంలో గల పడమట చెరువు, వెంకటయ్య చెరువు, నాగుల కుంట కు నీళ్లు నింపితే ఆ ప్రాంత రైతులకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు. రంగనాయకసాగర్ ఎల్ఎమ్ సి-ఆర్ 8 కాలువ వాగు క్రాసింగ్ బ్రిడ్జి పనులు వెంగంగా పూర్తి చేయాలని సంబంధిత ఏజన్సీ,  ఎస్ఈ ఇరిగేషన్ అధికారిని ఆదేశించారు. అదేవిధంగా ఆర్ 8 కాలువ ద్వారా మాటిండ్ల గ్రామం వరకు నీళ్లు ఇవ్వాలని చెప్పారు. రంగనాయకసాగర్ ఎల్ఎమ్ సి-ఆర్3, ఆర్ఎస్2-ఎల్ఎమ్ సి-ఆర్ 5 కాలువ పనులు, భూసేకరణ త్వరగా పూర్తి చేసి మైలారం, కమ్మర్లపల్లి,చౌదరం, అల్లిపూర్ కు వెంటనే నీళ్లు ఇవ్వాలని మంత్రి హరీశ్ చెప్పారు.

నంగునూర్ మండలం లోని ఘనపూర్, అక్కేనపల్లి, గట్లమాల్యాల గ్రామాలకు వాగు మీద జరుగుతున్న లిఫ్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా నాగరాజుపల్లి ద్వారా వాగులోకి ఎల్ డి 10 కాలువ ద్వారా వాగు లోకి నీళ్లు ఇవ్వాలని అధికారులను సూచించారు. నంగునూర్ మండలంలోని వెంకటాపుర్, రాంపూర్, జేపీ తండా, బద్దీపడగా కు వెళ్లే కాలువ ఎల్ డి6- ఎల్ఎమ్1 పనులు త్వరగా పూర్తి చేసి బద్దీపడగా వరకు నీళ్లు ఇవ్వాలని చెప్పారు. ఈ సమావేశంలో ఈఈ సాయి బాబా, ఏ ఈఈ ఖాజా, ఏ ఈఈ అమరజీవి, నాయకులు చందర్ రావు, సర్పంచ్ నరేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News