Thursday, January 23, 2025

సిఎం కెసిఆర్,కెటిఆర్‌ల చోరవతో ఐటి హబ్: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌ల ప్రత్యేక చొరవతో సిద్దిపేటలో ఐటి హబ్ ఏర్పాటు అయిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్‌లో వివిధ కంపెనీ ఆధ్వర్యంలో జరిగిన మెగా జాబ్ మేళాలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాక ప్రథమ ఐటి హబ్‌ను 63 కోట్లతో సిద్దిపేటలో నిర్మించుకున్నామన్నారు. ఈ ఐటి హబ్‌లో 1436 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నారు. ఇందులో రెండు సిఫ్ట్‌లుగా విభజించడం జరిగిందని ఒక్కొక్క సిప్ట్‌లో 718 మంది పని చొప్పున పని చేస్తారన్నారు. అలాగే ఐటి హబ్ నిర్వహణ బాగుంటే త్వరలో మరో 1000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. హైదరాబాద్‌లో ఉండే టాస్క్ శిక్షణ కేంద్రాన్ని ఐటి టవర్ గ్రౌండ్ ప్లోర్‌లో ఏర్పాటు చేసుకున్నామన్నారు.

గతంలో శిక్షణ కోసం హైదరాబాద్‌కు వెళ్లేవారిని ఇక ముందు ఇక్కడే 45 రోజుల పాటు 145 మందికి శిక్షణను ఇవ్వనున్నామన్నారు. ఈ టాస్క్ ద్వారా నిరంతరం శిక్షణ ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. సిద్దిపేటలో పరిశ్రమల కోసం స్థలం కేటాయించడం జరిగిందని ఈ పరిశ్రమలు సైతం ఏర్పాటు అయితే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఇప్పటికే సిద్దిపేట విద్య హబ్‌గా మారిందని ఇక ముందు ఉద్యోగ హబ్‌గా మారనుందన్నారు. ఉజ్వల భవిష్యత్తు కోసం తొలి మెట్టు ఎంతో కీలకమని ఉద్యోగం చిన్నదా పెద్దదా అని తేడా చూడకుండా ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉన్నతస్థాయిలో ఉద్యోగాలు ఉన్నవారు సైతం ఒకప్పుడు కింది స్థాయి ఉద్యోగం నుండే వచ్చారని గుర్తు చేశారు. ఈ ఐటి హబ్‌లో ఉద్యోగం రాని వారు నిరాశకు గురికావద్దని ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తానన్నారు.

ఈజాబ్ మేళాకు 8వేల దరఖాస్తులు వచ్చాయని ప్రతి ఒక్కరికి ఏదో రకమైన జాబ్ కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఐటి కంపెనీల ప్రతినిధులు సతీష్, శ్రీనివాస్, శ్రీకాంత్, ముత్యం, సంపత్, ఆశోక్, రమాకాంత్, రాహుల్, పల్లవి, శేఖర్, జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజా శర్మ, ప్రజాప్రతినిధులు , నాయకులు కడవేర్గు రాజనర్సు, మారెడ్డి రవీందర్, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, కొండం సంపత్ రెడ్డి, దేవునూరి చంద్రకాంత్ , నాగరాజు రెడ్డి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News