Sunday, December 22, 2024

కృష్ణా, గోదావరి జలాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చాం

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు: హైదరాబాద్ కు కృష్ణా, గోదావరి జలాలు తెచ్చామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. సింగూరు జలాలను సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు తరలిస్తున్నామని మంత్రి సూచించారు. సంగారెడ్డిలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దేశంలో మొట్టమొదటి రెసిడెన్షియల్ లా కాలేజ్ సంగారెడ్డిలో వస్తుందని ఆయన సూచించారు.

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల కింద 4 లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని మంత్రి వెల్లడించారు. సంగమేశ్వర, బసవేశ్వ పూర్తయితే సంగారెడ్డి జిల్లాకు సమృద్ధిగా నీరు వస్తుందని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. వెనుకబడిన నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాలూ అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. అనేక పరిశ్రమలు వస్తున్నాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News