Thursday, January 23, 2025

అరీట్ హాస్పిటల్స్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

అత్యాధునిక వైద్య సదుపాయాలతో
ప్రజలకు అందుబాటులోకి వచ్చిన అరీట్ హాస్పిటల్స్

మనతెలంగాణ/హైదరాబాద్ : అత్యాధునిక వైద్య సదుపాయాలతో గచ్చిబౌలిలో అందుబాటులోకి తీసుకువచ్చిన అరీట్ హాస్పిటల్స్‌ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అరీట్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మాట్లాడుతూ, ఆసుపత్రి సేవలను పొందడంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడం, విశ్వసనీయ సేవలను అందించటమే లక్ష్యంగా అరీట్ హాస్పిటల్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. అరీట్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ వాసు గుత్తా మాట్లాడుతూ, హాస్పిటల్, హాస్పిటాలిటీని కలిసే అత్యాధునిక వైద్య సదుపాయం అరీట్ హాస్పిటల్స్ అని పేర్కొన్నారు. ఇక్కడ ఆరోగ్య సంరక్షణకు మించిన సంరక్షణ ఉంటుందని తెలిపారు. తమ ఆసుపత్రిలో అన్ని ఇన్‌పేషెంట్ గదులు రోగిని రిలాక్స్‌గా ఉంచడానికి సహజ కాంతితో నిండి ఉన్నాయని వివరించారు. అరీట్ హాస్పిటల్స్‌లోని ఐసియులు రోగికి ఇష్టమైన వ్యక్తి, వారి పక్కనే ఉండేలా సదుపాయాన్ని కలిగి ఉంటాయన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఇది పూర్తిగా కొత్త ఆఫర్ అని అరీట్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. ప్రభాకర్ రాజు తెలిపారు.

హాస్పిటల్‌లో రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్సలను అందించడానికి వైద్యంలో తాజా సాంకేతిక పురోగతులను ఉపయోగించుకునే అత్యుత్తమ నిపుణులు కలిగి ఉన్నాయని అరీట్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ వేముల పేర్కొన్నారు.
ఆరీట్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలు మల్టీ-స్పెషాలిటీ క్వాటర్నరీ కేర్ హాస్పిటల్‌గా అరీట్ హాస్పిటల్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇంటర్నల్ మెడిసిన్, న్యూరోసైన్సెస్, గైనకాలజీ, ప్రసూతి, ఆర్థోపెడిక్స్, రెనల్ సైన్సెస్, ప్రివెంటివ్ హెల్త్, కార్డియాక్ సైన్సెస్, ఆంకాలజీ, క్రిటికల్ కేర్, గ్యాస్ట్రోసైన్సెస్, పల్మోనాలజీ, రెస్పిరేటరీ డిసీజెస్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ వంటి స్పెషాలిటీల కోసం పూర్తి స్థాయి ప్రత్యేక సంరక్షణను ఈ హాస్పిటల్ అందిస్తోంది. రోగికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించటం లక్ష్యంగా అరీట్ హాస్పిటల్స్‌ను తీర్చిదిద్దారు. సాంకేతిక ఆధారిత ఆర్‌ఎఫ్‌ఐడి చెక్-ఇన్‌ల నుండి హైదరాబాదులో మొట్టమొదటిసారిగా ప్రత్యేకమైన ప్రివెంటివ్ మెడిసిన్ సెంటర్ వరకు, అరీట్ హాస్పిటల్స్ విశాలమైన ఒపిడిలు, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, పూర్తి ప్రైవేట్ ఐసియులు వంటి ఇతర ప్రత్యేక సదుపాయాలను ఈ హాస్పిటల్ కలిగి ఉంది.

Arete Hospitals

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News