Thursday, January 23, 2025

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao started the double bedroom houses

ములుగు : పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టి మిమ్మల్ని కొత్తింట్లోకి తోలడం సంతోషంగా ఉన్నదని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ ములుగు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామంలో సీఎం కేసీఆర్ మానస పుత్రిక రెండు పడకల గృహా ప్రవేశాల కార్యక్రమంలో హాజరై లబ్ధిదారులను మంత్రి గృహా ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 60 వేల రూపాయలు ఇస్తే ఆ డబ్బులు బేస్మెంట్ కూడా సరిపోయేవి కావని మంత్రి విమర్శించారు. సీఎం గజ్వేల్ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న క్రమంలో గజ్వేల్ తో పాటు రాష్ట్రంలో అన్నీచోట్ల మంచినీళ్ల గోస తీరిందని, అలాగే నాగిరెడ్డిపల్లి గ్రామ దశదిశ మారిందని, ఇప్పటికే గ్రామాభివృద్ధికై రూ.8.30 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని మంత్రి చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, సాగునీటి, తాగునీరు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పేద ప్రజానీకం సంబురంగా ఉన్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News