Monday, December 23, 2024

రాష్ట్ర ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

Minister harish rao vijay dashami greetings

హైదరాబాద్: విజయ దశమి (దసరా) పర్వదినం సందర్భంగా రాష్ట్ర, జిల్లా ప్రజలకు మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ అన్నింటా శుభం చేకూరాలని కోరుకున్నారు. చెడుపై మంచి విజయం సాధించడమే విజయదశమి ప్రత్యేకత అన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరాను మించిన పండుగ లేదని, దసరా పండుగలో మన సంప్రదాయం, సంస్కృతితో పాటు ఆత్మీయత ఉన్నదని మంత్రి చెప్పారు. ఈ పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అత్యంత వేగంగా పురోగతి సాధిస్తుందని చెప్పారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ప్రభుత్వం అన్నింటా మరిన్ని విజయాలు సాధించాలని ఈ పర్వదినాన అమ్మవారిని వేడుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దసరా పండుగ రాష్ట్రంలో, జిల్లాలో ప్రజలకు మరిన్ని విజయాలు అందించాలని కోరుకుంటున్నట్లు మంత్రి హరీశ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News