హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్రమంత్రులు తన్నీరు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం పర్యటిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పిల్లల ఐసియూను మంత్రి హరీశ్ ప్రారంభించారు. 150 పడకల ఆస్పత్రి విస్తరణ వార్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మహబాబాబాద్ లో రూ.550 కోట్లతో వైద్య కళాశాల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణలో 3 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్య 5వేలు దాటనుందన్నారు. ఈ ఏడేళ్లలో దాదాపు 30 మెడికల్ కాళాశాలలకు చేరుకున్నామని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ప్రజలు ప్రైవేటు దవాఖానకు వెళ్లి పైసలు వృథా చేసుకోవద్దని మంత్రి కోరారు. విడిపోతే తెలంగాణ చీకటి అవుతుందని ఆనాడు కిరణ్ కుమార్ అన్నారు… ఇవాళ ఎపిలో చీకటి ఉంది, తెలంగాణలో విద్యుత్ కోతలు లేవని స్పష్టం చేశారు. ఇవాళ ఢిల్లీ, గుజరాత్ లో కూడా కరెంట్ సరిగా ఉండట్లేదని సూచించారు. అబద్ధాల్లో బహుమతులు ఇస్తే.. అవన్నీ బిజెపికే వస్తాయని విమర్శించారు. ప్రాజెక్టులు ఆపాలని ప్రతిపక్ష నేతలు కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తోందని తెలిపారు. మీటర్లు పెట్టలేదని రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.25వేల కోట్లను కేంద్రం ఆపిందని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.
Live from Mahabubabad: Addressing the Public gathering after Laying Foundation Stone to District Hospital. https://t.co/FUQ80m7TQB
— Harish Rao Thanneeru (@trsharish) May 10, 2022