Monday, December 23, 2024

సీఎం కెసిఆర్ గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ సౌకర్యాలు కల్పించారు : మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : ప్రజల వైద్యం కోసం సిఎం కెసిఆర్ గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ సౌకర్యాలు కల్పించారని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలు కలియ తిరుగుతూ పేషంట్స్ తో ఆత్మీయంగా మాట్లాడుతూ , ఆసుపత్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యుల పనితీరు , సమయపాలన పై అరా తీసారు , సిఎం కెసిఆర్ నాయకత్వం లో పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి అంటే నమ్మకం పెంచేలా అన్ని సౌకర్యాలను కల్పించారని ఆదిశగా వైద్యులు ప్రజలకు ఆరోగ్య సేవలను అందించాలని సూచించారు. ఆసుపత్రి క్షుణ్ణంగా పరిశీలించారు మొబైల్ ఎక్స్ రే ఎందుకు ఉపయోగంలోకి తేవడం లేదని ఆసుపత్రి ఆర్ ఎం ఓ ను అడిగి తెల్సుకున్నారు. వెంటనే ఉపయోగం లోకి తేవాలని ఆదేశించారు. గర్భిణీ లను ఆసుపత్రికి తీసుకొచ్చే ఆశ , ఏ ఎన్ ఎం లకి ప్రత్యేక గది ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సూపరెండెంట్ ను ఆదేశించారు.

ఆసుపత్రిలో సౌలత్ ఎట్లున్నాయ్… బెడ్ షీట్స్ మారుస్తున్నారా… స్కానింగ్ చేస్తున్నారా..ఎక్కడి నుండి వచ్చారమ్మ… కెసిఆర్ కిట్టు ఇచ్చారా.. స్కానింగ్ తీశార… మందులు బయట తెచ్చుకున్నారా ఇక్కడే ఇచ్చారా.. అంటు ఆసుపత్రిలోని బాలింతలతో , పేషంట్స్ తో ఆత్మీయంగా మాట్లాడారు. వారు నవ్వుతూ దవాఖాన సౌలత్ లు మంచిగున్నాయ్ సార్.. కేసీఆర్ కిట్టు ఇచ్చారు.. ఏ ఎన్ ఎం ఆసుపత్రికి తీసుకొచ్చింది..ఆసుపత్రి లో అన్ని సేవలు బాగున్నాయి అంటూ సంతోష పడ్డారు. ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు అని మంత్రి నవ్వుతూ అడగగా ..ఇంకెవరు సర్ కెసిఆర్.. మిరే అంటూ సమాధానం ఇచ్చారు.

మందులు బయట తెచ్చుకోవద్దని , స్కానింగ్ ఇక్కడే ఫ్రీగా చేస్తున్నమని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..మంత్రి హరీష్ రావు సామాన్యుడిగా ఆసుపత్రి ఎమెర్జెన్సీ వార్డు లో కి వచ్చి డాక్టర్ ఎక్కడ అని అడిగే సరికి వైద్యుల్లో ఒక్కసారే ఆశ్చర్యానికి లోనయ్యారు. .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News