Wednesday, January 22, 2025

గజ్వేల్ లో పర్యటించిన మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

minister harish rao visit in gajwel

గజ్వేల్ : సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన మర్కూక్ లో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శుక్రవారం పర్యటించారు. నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… ప్రజలకు ప్రభుత్వ ఆఫీసులలో ఏదైనా పని ఉంటే అన్నీ కార్యాలయాలు ఒకేచోట ఉండాలని, ప్రజలకు ప్రభుత్వ అధికారుల సేవలు సులభంగా అందాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమన్నారు.

ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాన్నీ ఒకేచోట అందుబాటులో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పించారని చెప్పారు. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని పనిని టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ మానవతావాదిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వచ్చే రోగి బంధువులకు మూడు పూటలా భోజనం పెట్టిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు 99 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే, తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2 కోట్ల 59 మెట్రిక్ టన్నులు ధాన్యం పండిందని మంత్రి హరీశ్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరం నీళ్లు పారలేదని బీజేపీ తొండి మాటలు చెప్పే నాయకులు.. సిద్ధిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలకు రండి.ఎక్కడెక్కడ నీళ్లు పారాయో.. చెరువులు, కుంటలు నిండాయో.. రుజువులు చూపిస్తామన్నారు. పేద ప్రజల కోసం పని చేసేది టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం. సొంత ఇంటి అడుగు జాగలో ఇళ్లు నిర్మించుకునే వారికి రూ.3 లక్షలు త్వరలోనే మంజూరు చేస్తామని సూచించారు. పామాయిల్ తోటలకై సీఎం కేసీఆర్ వెయ్యి కోట్లు సబ్సిడీ పెట్టారని రైతులు విరివిగా సాగు చేసేందుకు ముందుకు రావాలని మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News