Monday, December 23, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటించనున్నారు. ఆ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 9 గంటలకు సిద్దిపేట నుండి జగిత్యాల జిల్లా కోరుట్లకు బయల్దేరుతారు. 11 గంటలకు కోరుట్లకు చేరుకున్న ఆయన డయాలసిస్ సెంటర్ ను ప్రారంభిస్తారు. 11 గంటల 45 నిమిషాలకు మెట్ పల్లి చేరుకొని, 30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు ధర్మపురికి చేరుకున్న మంత్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుంటారు. 3 గంటల 15 నిమిషాలకు ధర్మపురిలో నిర్మించిన 50 పడకల ఆసుపత్రితో పాటు, డైయాలసిస్ సెంటర్, ఆక్సిజన్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 4 గంటల 15 నిమిషాలకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో నిర్మించనున్న 30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తరువాత అక్కడి నుండి కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వెళ్లనున్నారు. మార్గ మధ్యలో కరీంనగర్ లోని మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి పరామర్శకు వెళ్లే అవకాశమున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News