Monday, January 20, 2025

టిఆర్‌ఎస్ పార్టీకి కంచుకోట సిద్దిపేట..

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: టిఆర్‌ఎస్ పార్టీకి కంచుకోట సిద్దిపేట అని రాష్ట్ర ఆర్ధిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట అర్బన్ మండలం బక్రీ చెప్యాల , పూల్లూరు, నారాయణరావుపేట మండలాల వారిగా బిఆర్‌ఎస్ పార్టీకి విరాళాలు మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట నియోజక వర్గం అన్నింటిలో ఆదర్శంగా నిలిచిందన్నారు.సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించి అభివృది సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. అదే స్పూర్తితో బిఆర్‌ఎస్ పార్టీ అవిర్బావం చేశామన్నారు. సిద్దిపేట ప్రజలు అన్నింటిలో భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు రూ. 15 లక్షల విరాళాల సేకరణ చేశామన్నారు. నేడు వివిధ సంఘాలు మంత్రి హరీశ్‌రావును కలిసి విరాళాలు అందజేశారు. సిద్దిపేట అర్బన్ మండలం బక్రీ చెప్యాల గ్రామ పద్మశాలి సంఘం రూ. 16 వేలు, సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామ యాదవ సంఘం 10 వేలు, నారాయణరావుపేట గౌడ సంఘం 20 వేలు విరాళంగా అందజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News