Monday, January 20, 2025

మంత్రి హరీశ్‌రావుకు వర్గల్ క్షేత్ర ఆహ్వాన పత్రిక అందజేత

- Advertisement -
- Advertisement -

వర్గల్: ప్రసిద్ది వర్గల్ విద్యాధరి క్షేత్రానికి అనుబంధంగా నిర్మించిన శంకరమఠం, శారద స్మార్త వేద విద్యాలయ ప్రారంభ మహోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆలయ వ్యవస్థ్ధాపక చైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్దాంతి నేతృత్వంలో మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు ఆహ్వాక పత్రిక అందజేశారు. కంచి పీఠాదిపతి శంకర్ విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా 11న వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.

స్వామివారి విజయ యాత్రలో భాగంగా మూడు రోజుల పాటు వర్గల్ శంకర మఠంలో కంచి పీఠాదిపతి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావుకు వేద పండితులు అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదాలు, వేద ఆశీర్వచనాలు అందజేశారు. సిద్దాంతి చంద్రశేఖర శర్మ నేతృత్వంలో ప్రముఖ క్షేత్రంగా విలసిల్లుతున్న వర్గల్ విద్యాధరి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం ఉంటుందని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News