Sunday, December 22, 2024

డోసుల మధ్య వ్యవధి తగ్గించండి

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao writes to Union health min Mansukh Mandaviya

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు మంత్రి హరీశ్ లేఖ

మనతెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ వ్యాక్సినేషన్ రెండో డోస్, బూస్టర్ డోస్ మధ్య వ్యవధి తగ్గించాలని కోరుతూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు మంత్రి హరీశ్‌రావు మంగళవారం లేఖ రాశారు. రెండో డోసు, బూస్టర్ డోసు మధ్య గడువు 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని లేఖలో కోరారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోస్ అంశాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోసు, బూస్టర్ డోసు మధ్య గడువు 3 నెలలకు తగ్గించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న బూస్టర్ డోస్ పాలసీలు, వాటి ఫలితాలను ఆధారంగా చేసుకుని ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదించినట్టు హరీశ్‌రావు స్పష్టం చేశారు. గతంలోనూ బూస్టర్ డోస్, పిల్లల వ్యాక్సినేషన్‌పై కేంద్రానికి మంత్రి లేఖ రాసిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News