Friday, November 15, 2024

చెత్తలేని సిద్దిపేట నిర్మాణమే మంత్రి హరీశ్‌రావు లక్ష్యం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట  : చెత్తలేని సిద్దిపేట నిర్మాణమే మంత్రి హరీశ్‌రావు లక్ష్యమని మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. శుక్ర వారం స్వచ్ఛ సిద్దిపేట నిర్మాణంలో భాగంగా పట్టణంలోని 15వ వార్డు ఇమాంబాద్ గాడిచర్లపల్లిలో 6 గ ంటల నుంచి నడుస్తూ చెత్త వేరడంలో పాల్గొని చెత్తను సేకరించి వేరు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వచ్ఛ సిద్దిపేట నిర్మాణానికి సిద్దిపేట ప్రజలందరు సహకరించాలన్నారు.

ఓపెన్ ప్లాట్లలలో చెత్తను వేసే వారిని చుట్టు ప్రక్కల ఉన్నటువంటి వారు గమనించి మందలించాలన్నారు. పట్టణంలోని ప్రజలందరు చెత్తను కేవలం మున్సిపల్ వాహానాలకు మాత్రమే అందించాలన్నారు. ఓపెన్ ప్లాట్‌లలో చెత్త వేస్తే దోమలు, ఈగల ద్వారా ప్రజలు అనారోగ్యాలకు గురవుతారన్నారు. ప్రజలలో చాలా వరకు మార్పు రావడం జరిగిందని కొంత శాతం మందిలో మార్పు రావడం లేదన్నారు. ప్రజలు అధికారులందరికి సహకరించాలన్నారు.

వార్డులు బాగుంటే పట్టణం అందంగా కనిపిస్తుందన్నారు. సిద్దిపేట ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం ఆలోచించే గొప్ప నాయకుడు మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజలు తప్పకుండా చెత్తను తడి, పోడి , హానికరమైన చెత్తగా వేరు చేసి కేవలం మున్సిపల్ వాహానాలకు మాత్రమే అందించాలన్నారు. ఆరుబయట చెత్త వేసే వారికి జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. సేకరించినటువంటి చెత్తను మూడు రకాలుగా వేరు చేసి మున్సిపల్ వాహానాలకు అందించారు. వర్షాకాలం కావున పోడిచెత్తను ఎవరు కూడా ఆరుబయట వర్షం పడే చోట పెట్టకూడదన్నారు. వార్డులోని గల్లీలు కలియతిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, కౌన్సిలర్లు పాతూరి సులోచన శ్రీనివాస్‌రెడ్డి, రెడ్డి విజయేందర్ రెడ్డి, తాడూరి సాయి ఈశ్వర్ గౌడ్, సాయన్నగారి సుందర్ , ఎడ్ల ఆరవింద్ రెడ్డి, గుండ్ల యోగేందర్, బిఆర్‌ఎస్ నాయకులు మోయిస్, వజీర్, శ్రీనివాస్ యాదవ్, బందారం రాజు, మున్సిపల్ సానిటరి ఇన్స్‌పెక్టర్లు , మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నతంగా చదువుకోవాలి   : సిద్దిపేట పట్టణంలోని 31వ వార్డు నాసర్ పురాలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ మోహిన్ పుర ప్రాథమిక పాఠశాలను మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, పోషక ఆహారాలు ఎప్పుడెప్పుడు పిల్లలకు అందజేసే తదితర అంశాలను విద్యార్థ్ధులను, పాఠశాల యాజమాన్యంను అడిగి తెలుసుకున్నారు.పాఠశాల పరిసరాలను కలియతిరుగుతూ పరిశీలించారు. విద్యార్థులు ఉన్నతంగా చదువుకోవాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, వైస్ చైర్మన్ జంగటి కనకరాజు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News