Monday, December 23, 2024

నేడు చిన్నచెల్మెడకు మంత్రి హరీశ్‌రావు రాక

- Advertisement -
- Advertisement -

మునిపల్లి: 7న మండలంలోని చిన్నచెల్మెడ గ్రామంలో ఏర్పాటు చేయనున్న సంగమేశ్వర, బసవేశ్వర పథకంలో భాగంగా పంప్ హౌస్ పనులను ప్రారంబించేందుకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హాజరవుతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను మంగళవారం అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, అదనపు కలెక్టర్ వీరారెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఎమ్మెల్యే మా ట్లాడారు రైతుల కోసమే సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అని తెలిపారు. పక్కనే ఉన్న సింగూరు ప్రాజెక్టు ఉన్నప్పటికీ మునిపల్లి మండలానికి సంబంధించి ఒక్క ఎకరాకు కూడా సాగు నీరు అందడం లేదన్నారు.

అందుకు రైతులకు మేలు చేసేందుకేఈ పథకానికి సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారన్నారు. మండలంలోని తక్కడపల్లి, గార్లపల్లి గ్రామాల మధ్య డబ్బా వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు నీళ్లు ఉండడంతో నిలిచి పోవడంతో బ్రిడ్జిని ఎమ్మెల్యే పరిశీలించారు. బ్రిడ్జి పనులు త్వరితగతిన పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అంతకుముందు బిఆర్‌ఎస్ చిన్నచెల్మెడ గ్రామ శాఖ అధ్యక్షుడు ఒగ్గు మోహన్ పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం మోహన్‌కు ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నీటిపారుదల సిఈ అజయ్ కుమార్, ఎస్‌ఈ మురళీధర్, తహశీల్దార్ శివకుమార్, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్, మండల అధ్యక్షుడు విజయ్ కుమార్, గ్రామ సర్పం చ్ విజయ్ భాస్కర్, ఎంపిటిసి మంద రాజశేఖర్, గ్రామ ఉప సర్పంచ్ దత్తుగౌడ్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పరుశరాంగౌడ్, బిఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మోహన్, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News