Wednesday, January 22, 2025

17న మంత్రి హరీశ్‌రావు పర్యటనను విజయవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కార్యకర్తలకు పిలుపు

బెజ్జంకి: మంత్రి తన్నీరు హరీశ్‌రావు బెజ్జంకి పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని బిఆర్‌ఎస్ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే రసమయి బాలకిష న్ పాల్గొని మాట్లాడారు. 17న మంత్రి తన్నీరు హరీశ్‌రావు దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారని ఈ కార్యక్రమానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం సభ స్థలాన్ని స్థ్ధానిక నాయకులతో కలిసి పరిశీలించారు. సభలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని నాయకులకు పలు సూచనలు చేశారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చు రాజయ్య, నాయకులు లక్ష్మణ్, పార్టీ అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్, ఎలా శేఖర్ బాబు,రావుల రాజు, చెన్న రెడ్డి పార్టీ నాయకులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News