Friday, January 10, 2025

రేపు మంత్రి హరీశ్‌రావు పర్యటన

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో నేడు రాష్ట్ర ఆర్థిక, వై ద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పర్యటించనున్నారు. ఉదయం 09.30 కొమురవెల్లి గ్రామం, మండలం, సిద్దిపేట జిల్లా – కొమురవెల్లి గ్రా మంలోని మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద ‘క్యూ’ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేయనున్నారు. 11.00 కరీంనగర్ రోడ్, సిద్దిపేట టౌన్ వద్ద స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరవుతారు. 11.40 సిద్దిపేట పట్టణంలోని కాటన్ మార్కెట్ యార్డులో రైతులకు స్ప్రింక్లర్స్ సెట్ల పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్దిపేట పట్టణంలో శారీరక వికలాంగులకు బస్‌పాస్‌ల పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 02.00 గంటలకు నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభించనున్నారు.

02.30 గంటలకు నంగునూర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో రైతువేదిక, యాదవ కమ్యూనిటీ హాల్, ఓపెన్ జిమ్, పల్లె ప్రకృతి వనం, రెడ్డి సంఘం ప్రారంభోత్సవం, సిఆర్‌ఆర్ ఆర్/ఎఫ్ వెంకటాపూర్ నుంచి మక్దుంపూర్ వరకు, గొర్రెల షెడ్ వరకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 04.00 గంటలకు నంగునూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో ఖానాపూర్ నుంచి నాగరాజపల్లి వరకు సిఆర్‌ఆర్ రోడ్డు వరకు రజక కమ్యూనిటీ హాల్, ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం, అంబేద్కర్ విగ్రహానికి ఆవిష్కరణ, శంకుస్థాపన చేయనున్నారు. 05.30 గంటలకు సిద్దిపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గుర్రాలగొంది గ్రామానికి చెందిన ఇంటి స్థలం పట్టాలు, గౌడ సంగం భూమి కేటాయింపు ధృవీకరణ పత్రం పంపిణీ చేయనున్నారు. 06.00 పిఎం సిద్దిపేట టౌన్, కరీంనగర్ రోడ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ సమీపంలోని సిద్దిపేట టౌన్ వద్ద బృందావన్ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News