సిద్దిపేట: నేడు సిద్దిపేట నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థిక , వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పలు అభివృద్ధి పనులను, పలు శంకుస్ధాపనలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు సిద్దిపేట పట్టణంలోని శ్రీ సంతోషి మాత దేవాలయంలో నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు.10.30 గంటలకు అర్బన్ మండలం మిట్టపల్లి ఎఆర్ సబ్ హెడ్ క్వార్టర్ ఎక్స్‌రోడ్ వద్ద ఎన్‌ఎసి భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. 11 గంటలకు ఎల్లు పల్లి గ్రామంలో కేజీవిబి జూనియర్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. 12 గంటలకు మంత్రి క్యాంపు కార్యాలయంలో చెక్కుల పంపిణీ, మధ్యాహ్నం 2 గంటలకు విపంచి కళా నియంలో కుట్టుమిషన్‌ల పంపిణి, 3 గంటలకు ఇందిరా నగర్ జడ్పీ హెచ్‌ఎస్ విద్యార్థులకు ఐఐటి విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, సాయంత్రం 4 గంటలకు క్యాంపు కార్యాలయంలో ప్రోసిడింగ్ కాపీల పంపిణీ, 5 గంటలకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
రేపు మంత్రి హరీశ్‌రావు పర్యటన
- Advertisement -
- Advertisement -
- Advertisement -