Monday, December 23, 2024

రాజకీయాల్లో జోక్యం వద్దు.. బిల్డర్లకు మంత్రి హరీశ్ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

మెదక్: బెంగళూరులో జరిగిన ఐటి దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. మెదక్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటి దాడుల్లో దొరికిన 42 కోట్లు కాంగ్రెస్ నేత అంబికాపతి ఇంట్లోనివే అన్నారు.

తెలంగాణలో డబ్బులు పంచి గెలవాలని కాంగ్రెస్ చూస్తుందని మంత్రి ఆరోపించారు. గతంలో కర్ణాటక లో 40 శాతం కమిషన్ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు 50 శాతం కమిషన్ నడుస్తోందని విమర్శించారు. అక్కడ కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసి తెలంగాణ కి డబ్బులు తరలిస్తున్నారు. 1500 కోట్లతో తెలంగాణలో గెలవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సగం సీట్లో అభ్యర్థులు కరువు ఉందన్నారు. పక్క పార్టీల నుంచి వచ్చేవాళ్ళ కోసం కాంగ్రెస్ దిక్కులు చూస్తుందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో హంగామా తప్ప గ్రౌండ్ లెవెల్ లో బలం లేదని ఆయన వెల్లడించారు. కర్ణాటకలో కొత్తగా ఎవరైనా ఇల్లు కడితే ఒక్కో SFTకి 75/- రూపాయల డబ్బులు కట్టాలి. అది కాంగ్రెస్ పార్టీ కాదు అది స్కాంగ్రెస్ పార్టీ అన్నారు. బెంగళూరు నుండి వయా చెన్నై మార్గంలో హైదరాబాద్ కి కూడా డబ్బులు చేరాయని ఆరోపించారు. కొంత మంది బిల్డర్ల ద్వారా డబ్బులు వచ్చాయని తెలిసింది.

జాగ్రత్తగా ఉండాలి మీ పని మీరు చేరుకుంటే బాగుంటుంది… రాజకీయాల్లో తలదూర్చి ఇబ్బందుల పాలు కావద్దని మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. కాంగ్రెస్ తెలంగాణలో గెలుస్తానని అనుకోవడం ఓ పగటి కల. కాంగ్రెస్ లో డబ్బుల్లోనోళ్ళకే టికెట్ ఇచ్చి నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేసింది. ఎన్ని డబ్బు సంచులతో వచ్చినా గెలుపు మాదే కేసీఆర్ హ్యాట్రిక్ పక్కా అని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News