Monday, December 23, 2024

కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభాశీస్సులు

- Advertisement -
- Advertisement -

Minister Harish says all the best to constable candidates

హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం జరిగే పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరి పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు మంత్రి హరీశ్ రావు శుభాశీస్సులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… టిఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక పోలీస్ ఉద్యోగాల కోసం మూడు సార్లు మెగా నోటిఫికేషన్లు విడుదల చేసిందన్నారు. రెండు నోటిఫికేషన్ల ద్వారా పెద్ద సంఖ్యలో ఎస్.ఐలు, కానిస్టేబుళ్లను పారదర్శకంగా రిక్రూట్ చేశారని పేర్కొన్నారు. ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా భారీగా పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. రేపు జరగనున్న కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షను ఏకాగ్రతతో రాసి మంచి మార్కులతో అర్హత సాధించాలని ఆకాంక్షిస్తున్నానని మంత్రి తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం సిద్దిపేట జిల్లాలో ఉచిత శిక్షణ ఇప్పించామన్న మంత్రి పోలీసు ఉద్యోగమనే కలను నెరవేర్చుకోవడానికి మీరు పడిన కష్టాన్ని వృధా పోనివ్వకండన్నారు. ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసి మీ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. మీరు విజేతలుగా నిలవాలని కోరుకుంటూ మంత్రి హరీశ్ “అల్ ది బెస్ట్” చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News