Monday, December 23, 2024

ప్రధాని మోడీపై మంత్రి హరీశ్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రధాని మోడీ ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీ కొట్టిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు
ఆరోపించారు. తమ ప్రభుత్వం మంచిగా పని చేయకపోతే ఢిల్లీలో అవార్డులు ఎందుకు ఇస్తున్నారని హరీష్‌రావు ప్రశ్నించారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని మోడీనే అంటున్నారు. పెట్టుబడులు వస్తున్నాయంటే కేసీఆర్ గొప్పతనం కాదా? అన్నారు. తెలంగాణకు ప్రధాని మోడీ ఏం చేశారన్నారు. మీకు ఈడీ, సీబీఐలు అండగా ఉండొచ్చు అన్న మంత్రి హరీశ్ తమకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారన్నారు. తెలంగాణకు చాలా నిధులు ఇచ్చామని మోడీ అంటున్నారు. మీరు డబ్బులు ఇవ్వలేదు.. మాకు రావాల్సిన నిధులు ఆపారు హరీష్‌రావు ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News