Thursday, January 23, 2025

మంత్రి వాహనంపై ఆందోళన కారుల దాడి

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్ర మంత్రి హసన్ ముష్రిఫ్ వాహనంపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఇనుపరాడ్లతో వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురిని పోలీస్‌లు అదుపు లోకి తీసుకున్నారు. దాడి జరిగిన సమయంలో మంత్రి ఆ వాహనంలో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ప్రభుత్వం ఆయన భద్రతను పెంచింది. మరాఠా రిజర్వేషన్ ఆందోళన కారులు ఇటీవల ఎన్సీపీ ఎమ్‌ఎల్‌ఎ ప్రకాశ్ సోలంకే నివాసంపై దాడి చేసి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News