Thursday, January 23, 2025

ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహా లక్ష్మి గణపతిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా మొదటిసారి ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని మట్టితో తయారు చేసినందుకు ఉత్సవ సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మట్టి, గోమ‌యంతో గణపతిని చేయడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. తెలంగాణ కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల‌ను పంపిణీ చేసింద‌ని తెలిపారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేర‌కు నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో ప్ర‌జ‌ల స‌హకారంతో గణేష్ ఉత్సవాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్ర‌శాంతంగా నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News