119 అసెంబ్లీ స్థానాలకు గాను 100పై చిలుకు స్థానాల బలమున్న ప్రభుత్వాన్ని ఎలా కూలుస్తారో చెప్పాలి
ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలవకుండాప్రధానిని, హోం,
ఆర్థికశాఖల మంత్రులను కలిసి ఫిర్యాదు చేయడంలో గవర్నర్ ఉద్దేశ్యమేమిటి? గతంలో ఎన్‌టిఆర్ ప్రభుత్వాన్ని
కూలిస్తే జరిగిందో ఆమె తెలుసుకోవాలి అప్పటి
గవర్నర్‌కు పట్టినగతే పడుతుంది: సత్యవతి రాథోడ్
తనను ఎక్కడ అవమానించారో గవర్నర్ చెప్పాలి 10ని.ల
ముందు చెబితే ప్రోటోకాల్ ఏర్పాటు ఎలా సాధ్యమవుతుంది
ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన గవర్నర్‌లందరూ ఐఎఎస్,
ఐపిఎస్‌లే తమిళిసై మాదిరిగా రాజకీయ పార్టీ నుంచి వచ్చిన వారు కాదు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : తాను తలుచుకుంటే తెలంగాణలో ప్రభుత్వం పడిపోయేది అంటూ గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర మంత్రులు తీ వ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, సంపూర్ణ ఆదరణతో అధికారంలో కొనసాగుతున్న ప్రభుత్వంపై గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమంజసంగా లేవని పేర్కొన్నా రు. తమిళిసై చేసిన వ్యాఖ్యలు గవర్నర్ వ్యవస్థకు మచ్చ తెచ్చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. హూభైకమంలో శు క్రవారం మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్ తమిళిసై వ్యాఖ్యల పై మండిపడ్డారు. ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్న ట్లు వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలకుగానూ 100కు పైచిలుకు టిఆర్‌ఎస్‌కు శాసనసభ్యు లు ఉన్నారని, అలాంటి ప్రభుత్వాన్ని గవర్నర్ ఎలా కూ లుస్తారని? హైదరాబాద్‌లో సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ప్రశ్నించారు.
గవర్నర్ ఢిల్లీకి వెళ్లి మాట్లాడిన తీరును చూస్తుంటే గవర్నర్ మనస్సులో ఏముందో అర్థం అవుతుందన్నారు. గవర్నర్‌ను చిన్నచూపు చూడాల్సిన అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. ఢిల్లీకి వెళ్లిన తమిళిసై రాష్ట్రపతిని కలువకుండా ప్రధానిని, హోంశాఖ మంత్రి, ఆర్ధిక శాఖ మం త్రి కలిసి ఫిర్యాదు చేయడంలో ఉద్దేశ్యం ఏమిటని ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ నిలదీశారు. గతంలో ఎన్‌టిఆర్ ప్రభుత్వాన్ని కూలిస్తే ఏం జరిగిందో గవర్నర్ తెలుసుకోవాలన్నారు. అప్పుడు ప్రభుత్వాన్ని కూలదోసిన గవర్నర్‌కు ఏ గతి పట్టిందో అవుతుందన్నారు. గవర్నర్‌ను చిన్నచూపు చూడాల్సిన అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. ఢిల్లీకి వెళ్లిన తమిళిసై రాష్ట్రపతిని కలువకుండా ప్రధానిని, హోంశాఖ మంత్రి, ఆర్ధిక శాఖ మం త్రి కలిసి ఫిర్యాదు చేయడంలో ఉద్దేశ్యం ఏమిటని ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ నిలదీశారు. గతంలో ఎన్‌టిఆర్ ప్రభుత్వాన్ని కూలిస్తే ఏం జరిగిందో గవర్నర్ తెలుసుకోవాలన్నారు. అప్పుడు ప్రభుత్వాన్ని కూలదోసిన గవర్నర్‌కు ఏ గతి పట్టిందో … అదే గతి పడుతుందంటూ సత్యవతి రాథోడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలు ప్రో రోగ్ కానందునే…. బడ్జెట్ సమావేశాలు పెట్టుకున్నమన్నారు. దీనిపై గవర్నర్‌కు ఉన్న అభ్యంతరం ఏమిటన్నారు. ఇది గవర్నర్ గౌరవాన్ని తగ్గించినట్లు కాదన్నారు. ఈ విషయాన్ని తమిళిసై భూతద్దంలో చూసి……తనను రాష్ట్ర ప్రభుత్వం అవమానించినట్లుగా భావిస్తున్నారన్నారు. సిఎం కెసిఆర్‌కు మహిళలంటే ఎంతో గౌరవమన్నారు. మహిళలను అత్యంత గౌరవంగా, మర్యాదగా చూసుకునే సంస్కృతి మాదన్నారు. అటువంటిది గవర్నర్‌ను అవమానించాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఢిల్లీ వెళ్లిన గవర్నర్ తమిళిసై అక్కడ కలువాల్సిన వారిని కలువకుండా బిజెపి నాయకులను కలిసి అనంతరం రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేయడం కరెక్ట్ కాదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇది ఒక బిజెపి కార్యకర్తగా మాట్లాడినట్టుగా తాము భావిస్తున్నామని అన్నారు.
10 నిమిషాల ముందు చెబితే ప్రోటోకాల్ ఎలా సాధ్యం అవుతుంది?
రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. ఆమె హుందాగా వ్యవహరిస్తేనే ఆమెకు ఇచ్చే గౌరవం ఎప్పటికీ ఉంటుందన్నారు. రాష్ట్రంలో తనను అవమానపరుస్తున్నారని గవర్నర్ అనడం సరికాదన్నారు. ఆమెను ఎక్కడ అవమానించారో చెప్పాలన్నారు. రాజ్యాంగపరంగా గవర్నర్‌కు ఇవ్వాల్సిన మర్యాద తప్పక ఇస్తామన్నారు. ఇటీవల గవర్నర్ యాదాద్రికి వెళ్లే 10 నిమిషాల సమయం ముందు సంబంధిత అధికారులకు సమాచారాన్ని అందించారన్నారు. కేవలం 10 నిమిషాల ముందు చెబితే ప్రొటోకాల్ ఎలా సాధ్యమవుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, గవర్నర్ తమిళిసై కేంద్రమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత రాష్ట్రంలో పాలనపై ఆరోపణలు చేశారన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి గవర్నర్లుగా వచ్చిన వారంతా ఐఎఎస్, ఐపిఎస్‌లేనని అన్నారు. తమిళిసై మాదిరిగా రాజకీయ పార్టీ నుంచి గవర్నర్‌గా రాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
తమిళిసై వ్యాఖ్యలను తప్పుపట్టిన ఫ్రొఫెసర్ నాగేశ్వర్‌రావు
రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలను మాజీ ఎంఎల్‌సి, ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు తప్పుపట్టారు. బడ్జెట్ సమావేశాలకు అనుమతివ్వకుండా 15 రోజులు పెండింగ్‌లో పెడితే అసెంబ్లీ రద్దయ్యేదని… ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. ఈ మేరకు గవర్నర్ వ్యాఖ్యలను ఖండిస్తూ నాగేశ్వర్‌రావు ట్వీట్ చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని…అలాంటప్పుడు కెసిఆర్‌ను ఇంటికి పంపడానికి గవర్నర్ ఎవరు? అని ఆ ట్వీట్‌లో ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఎవరు పాలించాలనేది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారన్నారు. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వం కాదన్నారు.