Monday, December 23, 2024

న్యాయసదస్సుకు హాజరైన ఇంద్రకరణ్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

Minister Indrakaran Reddy attended the legal conference

హైదరాబాద్ : తెలంగాణలో న్యాయ వ్యవస్థ సమస్యలను సిఎం, హైకోర్టు సిజె పరిష్కరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి. రమణ కోరారు. శనివారం ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో ప్రారంభమైన న్యాయ సదస్సుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు,సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు పాల్గొనగా.. ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్ వి రమణ మాట్లాడుతూ తెలంగాణలో న్యాయవ్యవస్థకు సంబంధిత నిర్ణయాలను అమలు చేయకుండా సీఎస్ పెండింగ్‌లో ఉంచడంపై మండిపడ్డారు. వ్యక్తిగత పనుల కోసం అడగడం లేదని న్యాయవ్యవస్థ బలోపేతానికే నిర్ణయాలు తీసుకుంటున్నామని సిజెఐ తెలిపారు. కోర్టుల్లో దయనీయమైన పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కోర్టుల్లో ఒక న్యాయవాది కోర్టు హాల్‌లోకి వెళ్లి.. వెనక్కి వస్తే తప్ప మరొకరు వచ్చే పరిస్థితి లేదన్నారు.ఈ అంశాలను న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News