Monday, December 23, 2024

అత్యంత వైభవంగా మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

- Advertisement -
- Advertisement -

నిర్మల్ : బంగల్ పెట్ లో నూతనంగా నిర్మించిన మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవోపేతంగా, శాస్త్రముక్తంగా నిర్వహించారు. అంత్యంత సుందరంగా నిర్మించిన ఆలయంలో నాలుగు రోజుల పాటు వేద మంత్రోశ్చరణలతో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గురువారం ప్రతిష్ట సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పాల్గొని, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిష్ట కార్యక్రమాల్లో నిర్మల్ పట్టణ, వివిధ గ్రామాలకు చెందిన అనేక మంది ప్రజలు తరలివచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్దతో తెలంగాణ రాష్ట్రం దైవభూమిగా మారుతున్నదన్నారు. భగవంతుని ఆశీస్సులతో, దైవ భక్తుడైన ముఖ్యమంత్రి నాయకత్వంలో నిర్మల్ నియోజకవర్గంలో 132 గ్రామ పంచాయతీల్లో, 42 వార్డుల్లో ఇలా ప్రతి ఊరికి, వార్డుకు ఒక్క దేవాలయాలను నిర్మించామని తెలిపారు. సుమారు రూ. 3 కోట్లతో కృష్ణ శిలలతో మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని పునఃనిర్మించామని చెప్పారు. ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసిన భక్తులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News