Wednesday, January 22, 2025

1.51 లక్షల మందికి పోడు పట్టాలు పంపిణీ : ఇంద్రకరణ్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 4,05,601 ఎకరాలకు చెందిన 1.51 లక్షల మంది అడవి బిడ్డలకు పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బుధవారం కుబీర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిరిజనులకు ఆయన పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం ఆశయ సాధనకు ముఖ్యమంత్రి కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, జల్, జంగల్, జమీన్ స్ఫూర్తితో అడవి బిడ్డలను అన్నదాతలుగా చేసి భూమి హక్కులను కల్పిస్తున్నామని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 4,05,601 ఎకరాల భూమిని 1.51 లక్షల మంది అడవి బిడ్డలకు పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇకపై పోడు భూములకు రైతు బంధు ఇస్తామన్నారు. గిరి వికాసం పథకం ద్వారా గిరిజన రైతులకు మేలు చేస్తున్నామని, పట్టదారులు తమ భూముల్లో బోర్లు వేసుకునేందుకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తామని వెల్లడించారు.

పోడు రైతులపై ఉన్న కేసులను ప్రభుత్వం ఎత్తివేస్తుందని స్పష్టం చేశారు. హక్కుదారులు తమ భూములను అమ్ముకోవడానికి వీలు లేదని, వారుసులకు మాత్రమే పోడు భూములపై హక్కులు ఉంటాయని వెల్లడించారు. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. తొమ్మిదేళ్లలో ఏజెన్సీలోని గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News