Monday, November 18, 2024

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Minister Indrakaran Reddy Munugodu Bypoll Campaigns

సంస్థాన్ నారాయ‌ణ‌పూర్: మునుగోడు ఉప ఎన్నిక‌ ప్ర‌చారంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స‌ర్వేల్ గ్రామంలో విస్తృతంగా పర్యటించి ఎనిమిదేళ్లలో టిఆర్ఎస్ సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. ప్రచారానికి వచ్చిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి కాలనీవాసులు డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి, తిలకం దిద్ది ఆశీర్వదించారు. వృద్ధులను అక్కున చేర్చుకొని పింఛన్‌ వస్తుందా అంటూ ఆరా తీశారు. ఎవ‌రికీ ఓటు వేస్తారు అని మంత్రి వృద్దుల‌ను అడుగ‌గా… ఇంకెవ‌రికేస్తాం మా కెసిఆర్ కే మా ఓటు అని స్ప‌ష్టం చేశారు. తమ ఇంటికి ఓట్లు అడగడానికి వచ్చిన మంత్రిని వృద్ధులు ఆశీర్వదించారు.

ఇంటింటికీ తిరుగుతూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. సిఎం కెసిఆర్‌ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. టిఆర్‌ఎస్‌ను మరోసారి దీవించాలని, టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డికి ఓటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్య‌ర్థించారు. కాంట్రాక్టుల కోసం, స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం పార్టీ మారి ఉపఎన్నిక‌లకు కార‌ణ‌మైనా… బిజెపి అభ్య‌ర్థికి ఈ ఎన్నిక‌ల్లో గుణ‌పాఠం చెప్పాల‌న్నారు. అనంత‌రం శ్రీనివాస ఫంక్ష‌న్ హాల్ లో నిర్మల్ నియోజకవర్గ టిఆర్ఎస్ శ్రేణులు, స‌ర్వేల్ గ్రామ‌ ముఖ్య నాయకులు, కార్య‌క‌ర్త‌ల‌తో సమన్వయ, సమావేశం నిర్వహించారు. అంత‌కుముందు శ్రీరామ లింగేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకుని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్ర‌త్యేక పూజలు చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళుతున్న మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వాహ‌నాన్ని ఆపి పోలీసులు త‌నిఖీ చేశారు. వారికి మంత్రి సహకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News