Saturday, November 23, 2024

పచ్చదనం పెంపు… సామాజిక బాధ్యత

- Advertisement -
- Advertisement -
Minister Indrakaran Reddy Review on Haritha Haram
అన్ని శాఖలు, అన్ని వర్గాల నుంచి హరితనిధికి నిధుల జమ
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం, సామాజిక స్పృహ ఉండాలనే సంకల్పంతోనే హరిత నిధి (గ్రీన్ ఫండ్) ఏర్పాటు జరిగిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం హరితనిధి పురోగతి, ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలపై అరణ్యభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని మంత్రి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల నుంచి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వ్యాపార, వాణిజ్య వర్గాలు, విద్యార్థులు తమ వంతుగా అందజేసే విరాళం హరితనిధికి జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటిదాకా సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలపై విభాగాల వారీగా ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖలు అంతర్గత ఉత్తర్వుల ద్వారా ప్రక్రియ వేగంగా పూర్తి చేసి, మే నెల నుంచి హరితనిధికి నిధులు జమ అయ్యేలా చూడాలన్నారు.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అమలు తర్వాత తెలంగాణలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల రూపు రేఖలు మారుతున్నాయని, పచ్చదనం- పరిశుభ్రత అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించారని మంత్రి అన్నారు. హరితనిధి ద్వారా సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో మరింత సమర్థవంతంగా పచ్చదనం కార్యక్రమాలను అమలు చేయటం సాధ్యం అవుతుందన్నారు. సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతికుమారి, పిసిసిఎఫ్,హెచ్‌ఓఓఎఫ్ ఆర్‌ఎం డోబ్రియాల్, రిజిస్టేషన్ల శాఖ ఐజి వి.శేషాద్రి, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్, సిడిఎంఎ కమిషనర్ ఎన్.సత్యనారాయణ, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్‌కుమార్, ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సయాద్ ఒమర్ జలీల్, ఎక్సయిజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అమ్మద్, పాఠశాల విద్యాశాఖ దేవసేన, అటవీశాఖ అడిషనల్ సెక్రటరీ ఎం. ప్రశాంతి, అదనపు పిసిసిఎఫ్ వినయ్‌కుమార్, ప్లానింగ్ శాఖ డైరెక్టర్ శ్రీరాములు, పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖలతో పాటు, ఇతర సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News