Friday, November 22, 2024

ప్రజా సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు

- Advertisement -
- Advertisement -

నిర్మ‌ల్: అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ ఇత‌ర పార్టీల‌కు చెందిన ప‌లువురు బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరుతున్నారు. నిర్మ‌ల్ రూర‌ల్ మండ‌లం న్యూ పోచంప‌హాడ్ గ్రామానికి చెందిన 40 మంది, దిలావర్ పూర్ మండ‌లానికి చెందిన 30 మంది, న‌ర్సాపూర్ మండ‌లానికి చెందిన 30 మంది, ల‌క్ష్మ‌ణ‌చాంద మండ‌లం క‌న‌కాపూర్ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ ను వీడి గులాబీ గూటికి చేరారు. అదేవిధంగా అంబేడ్క‌ర్ యువ‌జ‌న సంఘాల‌కు చెందిన ప‌లువురు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మ‌క్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వీరికి గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా స్వాగ‌తం ప‌లికారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ… నిరుపేద ప్రజలకు అండగా సీఎం కేసీఆర్ సారధ్యంలో అద్భుతమైన పథకాలు అమలుచేస్తున్నారని, దళితబంధు, బీసీ బంధు, మైనార్టీల‌కు ఆర్థిక స‌హాయం రైతు రుణ‌మాఫీతో ఇత‌ర పార్టీల‌కు చెందిన వారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నార‌ని అన్నారు. దీంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో కూడా మ‌రింత‌ జోష్ పెరిగిందని తెలిపారు.

రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాసంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.  బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన వారికి పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యాన్ని కూడా కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతిపక్ష నాయకులు పభుత్వ పథకాలు, సంక్షేమం చూసి తట్టుకోలేక అధికార పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారని విమర్శించారు. ప్రజలు వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నారని, మోసపూరిత నాయకుల మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు.

Also Read: 10లక్షల మందితో కాంగ్రెస్ బహిరంగ సభ..!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News