Monday, December 23, 2024

నైట్ హాల్ట్ బస్సు సేవలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నిర్మల్ నుంచి మహారాష్ట్రలోని అప్పారావుపేట గ్రామం వరకు టీఎస్ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం నైట్ హాల్ట్ బస్సు సేవలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జెండా ఊపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మల్ నుంచి అప్పారావు పేట్ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండ సురక్షింతంగా సకాలంలో ఇంటికి చేరుకోవచ్చని అన్నారు. గ్రామానికి నైట్‌హాల్ట్‌ బస్సు సేవలు ప్రారంభం కావడంతో విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు తప్పాయని తెలిపారు. నైట్‌హాల్ట్‌ బస్సు ఏర్పాటు చేయడం వల్ల ఉదయం సమయంలో స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళే విద్యార్థులకు, ఆస్పత్రులకు వెళ్లే వచ్చే వారికి ఈ బస్ సేవలు ఎంతో సౌకర్యంగా ఉంటాయని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News