Sunday, December 22, 2024

భద్రాద్రి రామయ్య భూములను కాపాడుతాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి: భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో వారికి పండితులు వేదాశీర్వచనం అందించారు. పూజారులు, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు రాములవారి క్షేత్రానికి వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వేద పండితులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. మంత్రి ఇంద్రకరణ్ వెంట ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, తదితరులు ఉన్నారు.

Also Read: ఆఫ్రికాలో మరో ప్రాణాంతక వైరస్…

దర్శనానంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ…. పురుషోత్త పట్నంలోని భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆస్తులు.. మాన్యాలు రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఆయన పేర్కొన్నారు. అక్రమార్కుల నుంచి నుంచి భూములను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. ఇప్పటికే అక్కడ ఆక్రమ కట్టడాలను కూల్చివేయడం జరిగిందని వెల్లడించారు. మరోవైపు భద్రాద్రి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి ఇంద్రకరణ్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News