Wednesday, January 22, 2025

కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

Minister Indrakaran Reddy visited Kanakadurgamma

 విజయవాడలో కనకదుర్గ ఆలయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

హైదరాబాద్ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ ఈవో భ్రమరాంబ, అర్చకులు సాదరంగా ఆహ్వానం పలికారు. దుర్గాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రికి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఆయనకు అందజేశారు. దుర్గమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అందరినీ చల్లగా చూడాలని దుర్గమ్మను కోరుకున్నానని మంత్రి తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News