Thursday, January 23, 2025

రేపు నాందేడ్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహారాష్ట్రలో జరిగే బిఆర్‌ఎస్ బహిరంగ సభ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేడు నాందేడ్ జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ విస్తరణలో భాగంగా పలు గ్రామాల్లో పర్యటించి బిఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులను కలిసి సభకు ఆహ్వానించనున్నారు.
నేడు ఉదయం 10 గంటలకు కిన్వట్ తాలూకలోని అప్పారావు పేట్, 11.30 గంటలకు షివిని, మధ్యాహ్నం 12. 20 గంటలకు ఇస్లాపూర్, ఒంటిగంటకు హిమాయత్ నగర్, 2.30 గంటలకు బోకర్ పట్టణంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటిస్తారు. ఆదివారం నాందేడ్‌లో జరిగే బిఆర్‌ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను సైతం మంత్రి పర్యవేక్షించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News