Friday, April 25, 2025

మంత్రి ఎర్రబెల్లి వాహనాలు తనిఖీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్‌ని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి ఎర్రబెల్లి పూర్తిగా సహకరించారు. మంగళవారం మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు తనిఖీ చేశారు. వాహనాల్లో ఏమైనా డబ్బు ఉందా? ఎంత ఉంది? అంటూ ఆరా తీశారు. తమ వాహనం మొత్తం, వెంట ఉండి మరీ, పోలీసులకు చూపించారు. వాహనాల పరిశీలన తర్వాత తమకు సహకరించిన మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News