Sunday, December 22, 2024

రైతు పొలంలో బ్యాంకు ఫ్లెక్సీలు..సిబ్బందిపై మంత్రి సీరియస్

- Advertisement -
- Advertisement -

మన రుణం తీర్చలేదని రైతు పొలంలో ఫ్లెక్సీ కట్టిన బ్యాంకు అధికారులపైన రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వెలిబుచ్చారు. కామారెడ్డి జిల్లా, లింగంపేట గ్రామంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వారు ఒక రై తు పొలంలో ప్లెక్సీలు కట్టిన ఘటనపైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరాతీసారు. ఈ సందర్భముగా బ్యాంకు అధికారులు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ, సదరు రైతు కు 2010లో దీర్ఘకాలిక రుణం మంజూరు చేశామని,

గడువు 9 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అనేక సార్లు కలిసి రుణాన్ని చెల్లించవలసిందిగా విజ్ఞప్తి చేసామని తెలిపారు. బ్యాంకుకు తనాఖా పెట్టిన భూమిని కూడా ఇతరులకు విక్రయిస్తున్నాడని, ఆ సందర్భముగా అలా పెట్టవలసివచ్చిందని వివరించగా, దానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలా ప్లెక్సీలు పెట్టడం లాంటి పద్ధతులను తమ ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News