Friday, December 20, 2024

కుక్కల దాడిలో బాలుడి మృతిపై మంత్రి దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన మంత్రి

మనతెలంగాణ/హైదరాబాద్: షేక్‌పేట్‌లోని వినోబానగర్‌లో జరిగిన కుక్కల దాడిలో ఐదు నెలల శరత్ అనే బాలుడు మృతి చెందడంపై రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు దురదృష్టకరమని, ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. బాలుడి తల్లిదండ్రులకు మంత్రి తన సంతాపాన్ని తెలియచేశారు. బాలుడి తల్లిదండ్రులు అనూష, అంజిలు కూలీలుగా పని చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News