Thursday, January 23, 2025

గుజరాత్ లో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టిన ఘనుడు మోడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ గా శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం. ముఖ్యఅతిథిలుగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2014 ముందు తెలంగాణ లో వ్యవసాయ రంగం అగమ్యగోచరంగా ఉంది, ఇపుడు రైతులకు 24 గంటల ఉచిత కరంట్ ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్న ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా రైతులకు ఇప్పటికి 7 గంటలకు మించి కరంట్ ఇవ్వడం లేదు. గుజరాత్ లో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టిన ఘనుడు మోడీ. రైతుల ఉసురు తీసుకుంటున్నరు ప్రధాని మోడీ. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీజేపీ పార్టీ ద్వంద విధానాలను ఎండ గట్టారు. బీజేపీ నాయకులు తేలు కుట్టిన దొంగల్లా తప్పించుకు తిరుగుతున్నరు.

Minister Jagadeesh reddy fires on BJP

కేంద్ర మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ప్రధాని మోడీకి కేసీఆర్ భయం పట్టుకుంది. కేసీఆర్ గారిని నిలువరించడమే మోడీ పనిగా పెట్టుకున్నడు. గుజరాత్ లో అన్నదాతలు కేసీఆర్ గురించి గొప్పగా చర్చించుకుంటున్నారు. మోడీని ఎక్కడికక్కడ అన్నదాతలు నిలదీస్తున్నారు. తెలంగాణలో కరంట్ కోతలు తెచ్చేలా మోడీ అండ్ గ్యాంగ్ కుట్రలు చేస్తున్నారు. తెలంగాణ లో వ్యవసాయాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నరు మోడీ అండ్ గ్యాంగ్. ఇప్పటికైనా ప్రజల్లో చైతన్యం రావాలి. బీజేపీ జెండాలను తరిమి కొట్టాలి. కేసీఆర్ గారిని విమర్శిoచే వాళ్ళను తరిమి కొట్టాలి. మోడీ ఆదాని కోసం పని చేస్తున్నాడు. ప్రజల సొమ్మును దోచుకుతిన్నరు మోడీ, ఆదానిలు.

పల్లా రాజేశ్వర్ రెడ్డి
అన్నదాతలకు 24 గంటల ఉచిత కరంట్ ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. పంజాబ్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ వ్యవసాయ విధానాన్ని, ఇరిగేషన్ ను మెచ్చుకున్నారు. రైతు ఆత్మహత్య లు లేని రాష్ట్రం మన తెలంగాణ. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న రైతు సక్షేమ కార్యక్రమాలతో వ్యవసాయo పండుగలా మారింది. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News