Thursday, January 23, 2025

కవితకు ఈడి నోటీసులు.. మోడీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సూర్యాపేట: ఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులపై స్పందించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. బిజెపి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగ సంస్థల దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు. దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి ఇచ్చిన నోటీసులు కావు. రాజకీయ దురుద్ధేశం తోటే కవిత కు నోటుసులు అని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో ఆప్, ఇక్కడ బి ఆర్ యస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టెది కుట్రలో భాగమే.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకే ఈడి నోటీసులు. ఇటువంటి పప్పులు. కేసీఆర్ ముందు ఉడకవు. నియంతలు ఎప్పుడూ నిలబడ లేదు. బి ఆర్ యస్ ను నిలువరించగలం అనుకుంటున్న వారిది మూర్ఖత్వం. మోడీ దుర్మార్గాలకు కాలం చెల్లింది, బిజెపి సర్కార్ ను గద్దె దింపే వరకు పోరాటం చేస్తాం. కేసులు, జైళ్లు మాకు కొత్త కాదు. ప్రజల కోసం పనిచేసేవారికి ఇవి తప్పవు. 2001 లో రాష్ట్ర సాధన కోసం ఉద్యమం మొదలు పెట్టిన రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది ఇదేనని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News